ఖమ్మం వార్తలు

సిపిఐ జిల్లా కార్యదర్శిగా దండి సురేష్ …సహాయ కార్యదర్శి గా జితేందర్ రెడ్డి …

సిపిఐ సిపిఐ జిల్లా కార్యదర్శిగా దండి సురేష్ సహాయ కార్యదర్శిగా జమ్ముల జితేందర్ రెడ్డి ఎన్నికయ్యారు రెండు రోజులపాటు మదిరలో జరిగిన 23వ మహాసభలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. మహాసభలలో 91 మందితో కౌన్సిల్ ను 29 మందితో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు కార్యదర్శిగా ఎన్నికైన దండి సురేష్ ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం గ్రామంలో సాంప్రదాయ కమ్యూనిస్టు కుటుంభం లో జన్మించారు .విద్యార్థి దశలో ఏఐఎస్ఎఫ్ లో పనిచేసిన సురేష్ ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శిగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్న సురేష్ 23వ మహాసభలో కార్యదర్శిగా ఎన్నికయ్యారు. సహాయ కార్యదర్శిగా ఎన్నికైన జితేందర్ రెడ్డి చింతకాని మండలం నాగిలిగొండ గ్రామంలో జన్మించారు. విద్యార్థి యువజన ఉద్యమాలలో పనిచేసిన ఆయన తెలంగాణ రాష్ట్ర రైతు సంఘంలో సుదీర్ఘకాలం జిల్లా రాష్ట్ర బాధ్యతలను నిర్వర్తించారు. ప్రస్తుతం సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా పనిచేస్తున్నారు. వీరిద్దరు ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనం నేని సాంబశివరావు భాగం హేమంతరావు మహమ్మద్ మౌలానా తదితరులు నూతన నాయకత్వాన్ని అభినందించారు

సిపిఐ మహాసభలలో విస్తృతచర్చ..పలు తీర్మానాలు ఆమోదం

భారతకమ్యూనిస్టు పార్టీ 23వ మహాసభలలో రెండవరోజైన ఆదివారం విస్తృతచర్చ సాగింది. స్థానిక పోటు ప్రసాద్నగర్ (రెడ్డిగార్డెన్స్)లో సమకాలిన సమస్యలు పాలకవర్గాలు అనుసరిస్తున్న వైఖరి ప్రజా ఉద్యమ -నిర్మాణం పార్టీ విస్తృత భవిష్యత్ కార్యక్రమాలకు సంబంధించి, విస్తృతస్థాయిలో చర్చ జరిగింది. 46మంది చర్చలలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం మతోన్మాదం, కార్మిక రైతాంగ సామాన్య మధ్య తరగతి ప్రజలు -ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి పలు తీర్మానాలను ప్రవేశపెట్టగా మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. మైనార్టీల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా విస్తృతచర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ పథకాలను అమలు చేయాలని, మహాసభ-డిమాండ్ చేసింది. పూర్తి స్తాయి రూణమాఫీ, వ్యవసాయ కార్మికులకు ఇందిరమ్మ భరోసా, ఆటోకార్మికులకు -ఆర్థిక చేయూత, మహిళలకు నెలకు రూ.2500లు సంబధిత పథకాలను తక్షణమే అమలు చేయాలని మహాసభలో పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు. ముస్లిం, మైనార్టీలే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న -వివక్షపూరితధోరణికి వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. వ్యవసాయరంగ సమస్యలు, నూతనసాగు చట్టాలు, నాలుగులేబర్కోడ్లు తదితర అంశాలపైన చర్చించి తీర్మానాలు చేశారు. మహాసభలలో రాబోయే మూడు సంవత్సరాలకు నూతన నాయకత్వాన్ని ప్రతిపాదించగా మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది

జర్నలిస్టులకు మద్దతుగా తీర్మానం

జర్నలిస్టులకు మద్దతుగా తీర్మానాలు ఆమోదించింది. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు అన్ని కార్పోరేట్ ఆసుపత్రులలో చెల్లు బాటు అయ్యేవిధంగా హెల్త్ కార్డు మంజూరు చేయాలని మహాసభ తీర్మానంలో కోరింది .. అక్రిడేషన్ నిబంధనలను సవరిస్తూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అక్రిడేషన్కార్డులు ఇవ్వాలని, మండల జిల్లా స్థాయిలో ఇండ్ల స్థలాలను సత్వరం
పంపిణీ చేయాలని, ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. భవిష్యత్లో జర్నలిస్టులు చేపట్టే ఆందోళనకు పూర్తి మద్దతునివ్వాలని నిర్ణయిస్తూ మహాసభలో తీర్మానం చేశారు.సమావేశాల్లో జమ్ముల జితేందర్రెడ్డి, అజ్మీరా,రామ్మూర్తి, మందడపు రాణీ, దొండపాటి రమేష్, యంగల ఆనందరావు, మహాసభలో సిపిఐ రాష్ట్రకార్యదర్శి. కూనంనేని సాంబశివరావు, జాతీయసమితి సభ్యులు భాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి దండి సురేష్, సిపిఐ రాష్ట్రకంట్రోల్ కమిషన్ చైర్మన్ మొహ్మద్ మౌలానా, రాష్ట్ర సమితి సభ్యులు ఎర్ర బాబు ఎసికే జానిమియా, ఏపూరి లతదేవి. కొండపర్తి గోవిందరావు, సిద్ధినేని కర్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు.

కమ్యూనిస్టుల పని అయిపోయిందని ,వారికీ భవిష్యత్ లేదని పెట్టుబడిదారులు ,సామ్రాజ్యవాదులు చంకలు గుద్దుకుంటున్న తరుణంలో ప్రపంచవ్యాపితంగా ప్రజా ఉద్యమాలు పెరుగుతున్నాయని ,అమెరికాలోనే అధ్యక్షుడు ట్రంప్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్న విషయాన్నీ మర్చి పోరాదని అన్నారు ..అదే సందర్భంలో పక్కనే ఉన్న శ్రీలంకలో కమ్యూనిస్ట్ నేత దేశ అధ్యక్షునిగా ఎన్నికయ్యారని అన్నారు ..యూరప్ లోను మధ్య అమెరికాలో అక్కడ పాలకులకు వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనలు రేపటి భవిష్యత్ కు నాంది కాబోతున్నాయని పేర్కొన్నారు ..

సమాజంలో ఆర్థిక అసమానతలు వర్గాలు ఉన్నంతవరకు కమ్యూనిస్టుల పోరాటం కొనసాగుతుందని, ఎవరు -వద్దనుకుంటే ఆగేదికాదని, కమ్యూనిజం.. అజేయం అజరామరం అని సిపిఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు అన్నారు. కమ్యూనిస్టుల అవసరం పెరుగుతున్న నేపథ్యంలోనే బీజేపీ మొదలైన మత శక్తులు కమ్యూనిస్టులను లేకుండా చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నాయన్నారు. సిపిఐ జిల్లా సభల్లో పాల్గొన్న హేమంతరావు మాట్లాడుతూ… సమాజంలో -మార్పు అనివార్యం అని మార్క్స్ చెప్పినట్లుగా పెట్టుబడిదారి సమాజంలో అవినితి పెరిగినప్పుడు ఆ సమాజం పతనం అవుతుందని, ఇప్పుడు దేశంలో అదే పరిస్థితి నెలకొందని ఆయన తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్టు సానుకుల పవనాలు విస్తున్నాయని, గత -ఎన్నికలలో 0.5శాతం ఓట్లు సాధించిన కమ్యూనిస్టు పార్టీ శ్రీలంకలో అధికారంలోకి వచ్చిందన్నారు. దేశంలో బీజేపీ తన విధానలతో -నిరంకుశపాలనకు దారి తీస్తుందని ధ్వజమెత్తారు . ఆపరేషన్ కగర్ పేరుతో మావోయిస్టుల ఏరివేతతో అమాయిక ఆదివాసులను హతమారుస్తున్నారని, భవిష్యత్తులో అర్బన్ నక్సలిజం పేరుతో కమ్యూనిస్టులను, ప్రశ్నించే వారిని హతమార్చేప్రమాదం ఉందని హెచ్చరించారు. మైనార్టీలే టార్గెట్గా బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ను తన జేబు -సంస్థగా మార్చుకొని, విపక్ష ఓటర్లను తొలగించే పనిలో ఉందన్నారు. ఎన్నికల వ్యవస్థకే ముప్పు తెచ్చే ప్రయత్నం జరగడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టని అన్నారు ..

మీడియాను నియంత్రిచండంతో పాటు సోషల్మీడియా ద్వారా అభద్ధాల ప్రచారాలతో వాస్తవాలను మరుగున పెడుతుందని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలు విషయంలో నిర్ణయం తీసుకోవటంలో జాప్యం చేస్తుందన్నారు. విధాననిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం ప్రజల్లో అసంతృప్తికి దారితీస్తుందన్నారు. కాంగ్రెస్ గెలుపుకోసం కీలకంగా -వ్యహరించిన సిపిఐ విషయంలో మిత్ర ధర్నాన్ని పాటించాలని కోరారు. దేశ జనాభాలో సగానికిపైగా ఉన్న యువత నిరాశలో ఉందని, వారిని ప్రజా ఉద్యమాలవైపు ఆకర్షించాలని హేమంత్గావు పిలుపునిచ్చారు. సమాజమార్పు యువతతోనే సాధ్యం అని యువత రాజకీయ భవిష్యత్కు పూనాది అని, ఆయన తెలిపారు. పార్టీ ప్రజా సంఘాల నిర్మాణం అత్యంత అవశ్యం అని ప్రజా సంఘాల -నిర్మాణంపై దృష్టి సారించాలని కోరారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ బలానుగుణంగా పోటీ చేసి అత్యధికస్థానాలలో గెలుపొందేవిధంగా ప్రణాళికరూపొందించాలని కోరారు. పార్టీ నిర్మాణం అధ్యయనం విస్తృతపోరాటాలే లక్ష్యంగా భవిష్యత్ కార్యచరణరూపొందించాలని సూచించారు. మహాసభలలో పార్టీ మండల కార్యదర్శులు ప్రజా సంఘాల బాధ్యులు చర్చలలో పాల్గొనగా సభ పలు తీర్మానాలు ఆమోదించారు.

Related posts

పాలస్తీనా పై ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ ఖమ్మంలో భారీ సంఘీభావ ర్యాలీ…

Ram Narayana

ఘనంగా టీయూడబ్ల్యూజే (ఐజేయూ )ఖమ్మం జిల్లా 4 వ మహాసభలు…

Ram Narayana

పేదల సంక్షేమం ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యం…..మంత్రి పొంగులేటి

Ram Narayana