పార్లమంట్ న్యూస్ ...

రాష్ట్రాల రుణ పరిమితిపై లోకసభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి

రాష్ట్రాల రుణ పరిమితిపై లోకసభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి

కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన రాష్ట్రాల నికర రుణ పరిమితి, గత ఐదేళ్లలో వాస్తవ రుణాల వివరాలేంటి..? అని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి లోక్ సభలో ప్రశ్నించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా.. సోమవారం ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఆఫ్- బడ్జెట్ రుణాలను సర్దుబాటు చేసేందుకు ప్రత్యేక యంత్రాంగ ఏర్పాటు వివరాలను కోరారు. దీనికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

  • ఆర్థిక సంఘం సిఫార్సుల ఆధారంగా.. అన్ని రాష్ట్రాల వార్షిక నికర రుణ పరిమితి( ఎన్బిసి).. స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి ( జిఎస్ డి పి )లో ఒక శాతంగా నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి తెలిపారు. కోవిడ్ -19 తర్వాత 2020-21 ఆర్థిక సంవత్సరానికి.. రాష్ట్రాల రుణ పరిమితిని రెండు శాతం పెంచినట్లు పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఆర్ బీ ఐ) మార్గదర్శకాల మేరకు రుణాల కేటాయింపు ఉంటుందని తెలిపారు.
  • స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి ( జిఎస్ డిపి )లో రాష్ట్రాల వార్షిక నికర రుణ పరిమితి ( ఎన్బిసి).. 2020- 21 ఆర్థిక సంవత్సరంలో.. రాష్ట్రాలవారీగా వివరాలు తెలుపుతూ.. తెలంగాణకు 30, 102 కోట్లు, గత ఐదేళ్లలో అన్ని రాష్ట్రాల వాస్తవ బహిరంగ మార్కెట్ వివరాలు పేర్కొంటూ..2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి 56,209 కోట్లు, ఆఫ్ – బడ్జెట్ రుణాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి 2,697 కోట్ల కేటాయింపులు జరిగినట్లు వివరించారు.

Related posts

వన్ నేషన్, వన్ ఎలక్షన్‌ బిల్లులపై సందిగ్ధత… రేపటి లిస్టు నుంచి తొలగింపు!

Ram Narayana

రాజ్యసభలో తగ్గిన బీజేపీ సంఖ్యాబలం.. మెజారిటీకి 12 సీట్ల దూరంలో ఎన్డీయే…

Ram Narayana

మహిళలను మోసంచేసి పెళ్లి చేసుకుంటే పదేళ్లు జైలుకే.. కొత్త బిల్లులో కేంద్రం ప్రతిపాదన

Ram Narayana