జాతీయ వార్తలు

జార్ఖండ్ లో ఎన్కౌంటర్…మావోయిస్టు అగ్రనేత మార్కెన్ కెర్కెట్టా మృతి…

  • గుమ్లా జిల్లా కామ్‌డారా పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
  • ఎదురుకాల్పుల్లో పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా గ్రూపు అగ్రనేత మార్కెన్ కెర్కెట్టా మృతి
  • 72 కేసులు ఉన్న మార్కెన్ కెర్కెట్టాపై రూ.15 లక్షల రివార్డు

ఝార్ఖండ్‌లో జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు అగ్రనేత హతమయ్యాడు. గుమ్లా జిల్లా కామ్‌డారా పోలీస్ స్టేషన్ పరిధిలోని చంగబాది ఉపర్టోలీలో భద్రతా బలగాలు సోదాలు నిర్వహిస్తుండగా, మావోయిస్టులకు, పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయని అధికారులు వెల్లడించారు.

ఈ కాల్పుల సమయంలో ముగ్గురు మావోయిస్టులు తప్పించుకుని పారిపోగా, ఒక మావోయిస్టు మృతి చెందాడని వారు తెలిపారు. మృతి చెందిన వ్యక్తిని పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా గ్రూపునకు చెందిన అగ్రనేత మార్కెన్ కెర్కెట్టాగా గుర్తించామని, అతనిపై రూ.15 లక్షల రివార్డు కూడా ఉందని అధికారులు పేర్కొన్నారు.

మార్కెన్‌పై ఏడు జిల్లాలలోని పోలీస్ స్టేషన్లలో దాదాపు 72 కేసులు నమోదై ఉన్నాయని అధికారులు తెలిపారు. తప్పించుకుని పారిపోయిన ముగ్గురు మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వారు వెల్లడించారు. 

Related posts

బంగ్లాదేశ్‌లో హిందూ నేత హత్యపై తీవ్రంగా స్పందించిన భారత్!

Ram Narayana

ఏప్రిల్ 1 నుంచి కొత్త పన్ను చట్టం అమలు.. మారనున్న పన్నుల విధానం…

Ram Narayana

హెచ్‌ఐవీ బాధితుల్లో తెలంగాణ దేశంలో ఆరవ స్థానం..కేంద్రం

Ram Narayana