Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానం మంగోలియాకు మళ్లింపు…

  • ఎయిరిండియా విమానం ఏఐ174 బోయింగ్ క్రాఫ్ట్‌లో సాంకేతిక లోపం
  • ముందస్తు జాగ్రత్తగా ఉలన్‌బాటర్‌లో సురక్షితంగా దిగిన విమానం
  • విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు సంస్థ వెల్లడి

శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో దానిని మంగోలియాకు మళ్లించారు. ఎయిరిండియా విమానం ఏఐ 174 బోయింగ్ 777 ఎయిర్‌క్రాఫ్ట్‌ను ముందస్తు జాగ్రత్తగా ఉలన్‌బాటర్‌లో సురక్షితంగా దించినట్లు విమానయాన సంస్థ ప్రకటించింది.

విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు సంస్థ వెల్లడించింది. శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఈ విమానం మధ్యాహ్నం 2.47 గంటలకు బయలుదేరింది. సోమవారం రాత్రి 9.59 గంటలకు ఢిల్లీలో ల్యాండ్ కావాల్సి ఉంది. ఈ విమానం కోల్‌కతా మీదుగా ఢిల్లీకి రావాల్సి ఉంది.

Related posts

బీజేపీ ఓటమి నేపథ్యంలో రాజీనామా సమర్పించిన కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మై….

Drukpadam

దాడికి పాల్పడిన వారికి, కుట్రదారులకు కఠిన శిక్ష తప్పదు – నరేంద్ర మోడీ

Ram Narayana

హిమాచల్ వరదలతో 74 మంది మృతి.. ఏకంగా రూ.10 వేల కోట్ల నష్టం!

Ram Narayana

Leave a Comment