
- ఎన్టీఆర్ జిల్లా మీర్జాపురం కోడిపందాలలో పాల్గొన్న తెలంగాణ ఎమ్మెల్యేలు కోరం ,జారే
- కృష్ణా, గోదావరి జిల్లాలో కోడి పందాల జోరు …
- కోడి పందాలు వీక్షించేందుకు తెలంగాణ నుంచి వచ్చిన జనం
- ఎక్కడికక్కడ నిలిచిపోయిన ట్రాఫిక్ …వాహనదారుల ఇబ్బందులు
- కోడి పందాలకుతోడు పేకాట ,మూడు ముక్కలాంటి ఆటలు
- సంక్రాంతికి పల్లెల్లో సందడే సందడి …
- పశ్చిమ గోదావరి జిల్లాలో ఏపీ డిప్యూటీ స్పీకర్ సహా పలు నేతల సందడి
- పందెం రాయుళ్లు, ప్రేక్షకులతో పలు జిల్లాల్లో కోలాహలం

- సంక్రాంతితో పల్లెలన్నీ సందడిగా మారాయి…కోడి పందాలతో యువత కేరింతలు కొట్టింది .ప్రత్యేకించి ,భీమవరం , దెందుకూరు ,మిర్జాపురంలలో పెద్ద పెద్ద భర్రీలు ఏర్పాటు చేసి నిర్వహించిన కోడిపందాలకు వేలాదిగా ప్రజలు తరలి వచ్చారు …ఇందులో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషం. తెలంగాణ నుంచి కూడా ప్రజలు వచ్చారు ..ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఇల్లందు ఎమ్మెల్యేలు కోరం కనకయ్య ,అశ్వారావు పేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ , తెలంగాణ ఇరిగేషన్ డవలప్మెంట్ చైర్మన్ మువ్వా విజయబాబు మీర్జాపురంలో జరిగిన కోడిపందాలలో పాల్గొని పందాలను ఆశక్తిగా తిలకించారు ..కోడిపందాల బరిలో వారు పందాలను ప్రారంభిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు …నిర్వహకులు ఏర్పాట్లు ఘనంగా చేశారు ..నూజివీడు నుంచి హనుమాన్ జంక్షన్ కు వెళ్లే ప్రధాన రహదారికి కేవలం అర కిలోమీటర్ దూరంలో ఏర్పాటు చేసిన ఈ ప్రాంగణానికి జనం పోటెత్తారు …చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా హైద్రాబాద్ ,విజయవాడ , ఖమ్మం , సత్తుపల్లి , మధిర , అశ్వారావుపేట , కొత్తగూడెం ,ఇల్లందు భద్రాచలం ,మణుగూరు , పాల్వంచ ,చెన్నై , బెంగుళూరు నుంచి వచ్చిన అనేక మంది పందాలను తిలకించేందుకు వచ్చారు …వారికీ అక్కడ కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించారు ..

ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి వేడుకల్లో కోడిపందాలదే ప్రధాన సందడని చెప్పడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు పలుచోట్ల ఏటా సంక్రాంతి పండుగకు కోడిపందాలు నిర్వహిస్తుంటారు. ఈ పందాలను చూడడానికి తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల నుంచి జనం వస్తుంటారని స్థానికులు చెబుతున్నారు.
ఈసారి పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించిన కోడి పందాలలో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావులతో పాటు హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి పాల్గొని సందడి చేశారు. జిల్లాలోని కాళ్ల మండలం పెదఅమిరంలో జరిగిన ఈ పోటీలలో పాల్గొన్న నేతలు.. పందెం కోళ్లతో ఫొటోలకు ఫోజులిచ్చారు.
తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, పోలవరం, కృష్ణా జిల్లాలో కోడి పందాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. బరుల వద్ద పందెం రాయుళ్లు, ప్రేక్షకులతో కోలాహలం నెలకొంది.

