జాతీయ వార్తలు

దర్భాంగా మహారాణి రాజే ‘ కామసుందరి దేవి మరణం…

చరిత్ర పాఠాల్లో మనం ఎందరో రాజుల గురించి చదువుకున్నాం. కానీ, దేశం ఆపదలో ఉన్నప్పుడు తన సంపదనే ఆయుధంగా మార్చిన ఈ “వీర వనిత” గురించి మనలో ఎంతమందికి తెలుసు?

“దేశం నాకేమిచ్చింది అని కాదు… నేను దేశానికి ఏమిచ్చాను” అని ప్రశ్నించుకునేవారు కొందరే..
దేశం ఆపదలో ఉన్నప్పుడు తమ ఆస్తులను గడ్డిపోచల్లా విసిరేసిన త్యాగమూర్తులు మన గడ్డ మీద నడయాడారు. అలాంటి వారిలో అగ్రగణ్యులు దర్భంగా మహారాణి ‘కామసుందరి దేవి’

1962… చైనాతో యుద్ధం జరుగుతున్న వేళ. భారత సైన్యం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. దేశ ఖజానాకు అండ కావాలి. ఆ సమయంలో, ప్రభుత్వం అడగకముందే… ఒక తల్లి తన బిడ్డను కాపాడుకోవడానికి పరుగెత్తుకొచ్చినట్లుగా ఆమె ముందుకొచ్చారు.

కేవలం విరాళం ఇవ్వలేదు… చరిత్ర సృష్టించారు!

ఒకటి కాదు, రెండు కాదు… ఏకంగా 600 కిలోల బంగారాన్ని (600 Kg Gold) దేశ రక్షణ నిధికి అందించారు..భరతమాత పాదాలకు తన సంపద మొత్తం సమర్పించారు..

అంతేనా? తన వద్ద ఉన్న ప్రైవేట్ జెట్ (విమానాన్ని) కూడా సైనిక అవసరాల కోసం దానం చేశారు.

ఒక రాణిగా సింహాసనం మీద కూర్చోవడం కాదు… కష్టకాలంలో దేశానికి అండగా నిలవడమే నిజమైన రాజసం అని ఆమె నిరూపించారు. ఆనాడు ఆమె చేసిన త్యాగం, మన సైనికుల స్థైర్యాన్ని హిమాలయాలంత ఎత్తుకు పెంచింది.

బీహార్‌లోని విద్యాసంస్థలకు, పరిశ్రమలకు ఆమె చేసిన సేవలు ఎనలేనివి. రాజరికపు హోదా ఉన్నా, సామాన్యుల సంక్షేమమే ఊపిరిగా బతికారు.

నిన్ననే ఆమె తన 93 ఏటా తనువు చాలించారు . ఆమె భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు. కానీ 1962లో ఆమె చూపిన ఆ దేశభక్తి, ఆ త్యాగం… ఈ భరతజాతి ఉన్నంతకాలం చిరస్థాయిగా నిలిచిపోతుంది.

ఓ తల్లీ… మీ రుణం ఈ దేశం ఎప్పటికీ తీర్చుకోలేదు. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. దేశభక్తికి నిలువెత్తు రూపమైన మీకు వందల కోట్ల భారతీయుల నమస్కారాలు..

Related posts

ఆ రెండు రకాల రైళ్లలో ఎమర్జెన్సీ కోటా పునరుద్ధరణ…

Ram Narayana

షాకింగ్ రిపోర్ట్.. జ‌నాభా పెరుగుద‌ల రేటు క‌న్నా విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల రేటే అధికం!

Ram Narayana

2000 టమాటా బాక్సులు అమ్మి రూ.38 లక్షలు సంపాదించిన కర్ణాటక రైతు…

Drukpadam