ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

అంబటి ,జోగి రమేష్ ఇళ్లను కాదు మిమ్ములను మీరే దహనం చేసుకున్నారు …జగన్

అంబటి రాంబాబు ,జోగి రమేష్ ఇళ్లపై టీడీపీ కార్యకర్తలు దాడిచేసి ఇళ్లను వాహనాలను ధ్వంసం చేయడం ,నిప్పుపెట్టడం పై మాజీ సీఎం వైయస్ జగన్ ఫైర్ అయ్యారు …మనం ఎక్కడ ఉన్నాం ఇది ఏమి పాలన, జంగిల్ రాజ్ గా ఉంది .వాళ్ళ ఇళ్లను దహనం చేయడమంటే మిమ్ములను మీరే దహనం చేసుకున్నట్లే అని అన్నారు . ఇది ఎల్లకాలం సాగదని జగన్ హెచ్చరించారు ..ఇప్పటికే హైకోర్టు అంబటి రాంబాబు విషయంలో వాళ్లకు రక్షణ కల్పించడంలో జరిగిన వైఫల్యాన్ని గుర్తించు మొట్టికాయలు వేసినదని అన్నారు..ఆయన వాళ్లకు బుద్ది రాదు .. అంబటి ఇంటివద్ద పరిస్థితులు చక్కబడేవరకు 24 గంటలు రక్షణ కల్పించాలని ఆదేశించిన విషయాన్నీ గుర్తుంచుకోవాలని అన్నారు . జోగి రమేష్ ఇంటిపై దాడిచేసి పెట్రోల్ బాంబులు వేసి నిప్పు పెట్టడంపై జంగం ఫైర్ అయ్యారు . జోగి రమేష్ ను జగన్ ఫోన్ లో పరామర్శించారు .జరిగిన సంఘటనలు అడిగి తెలుసుకున్నారు .. పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ..రాష్ట్రలో చంద్రబాబు హింసను రాజేస్తున్నారని ధ్వజమెత్తారు .తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చేస్తున్న దాడులను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు .

Related posts

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియామకం

Ram Narayana

టీడీపీలో చేరుతున్నా: వాసిరెడ్డి పద్మ…

Ram Narayana

జగన్ ప్రాణాలకు ముప్పు ఉంది ..కేంద్రబలగాలతో రక్షణ కల్పించాలి ..ఎంపీ మిథున్ రెడ్డి

Ram Narayana