తెలంగాణ రాజకీయ వార్తలు ..

నందినగర్ నివాసం నుంచి ఎర్రవల్లి బయల్దేరిన కేసీఆర్…

  • ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ
  • నందినగర్ నివాసంలోనే కేసీఆర్ ను విచారించిన అధికారులు
  • ముగిసిన సిట్ విచారణ 

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ సిట్ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే సిట్ అధికారులు ఆయనను విచారించారు. విచారణ అనంతరం ఆయన ఎర్రవల్లి ఫాంహౌస్ కు బయల్దేరి వెళ్లారు. 

సిట్ విచారణ సందర్భంగా నంది నగర్ లోని కేసీఆర్ నివాసం వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలి వచ్చాయి. విచారణ ముగిసిన అనంతరం, కేసీఆర్ తన నివాసం బాల్కనీలో నిలబడి పార్టీ నాయకులు, కార్యకర్తలకు అభివాదం చేశారు. అనంతరం, బీఆర్ఎస్ ముఖ్య నేతలు, పార్టీ ప్రజాప్రతినిధులతో సమావేశం అయ్యారు. మున్సిపల్ ఎన్నికల గురించి వారికి దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలంగానే ఉందని, అయితే, అసమ్మతి లేకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. పలువురు నేతలు బీఆర్ఎస్ లో చేరుతున్నారని, అందరినీ కలుపుకునిపోవాలని సూచించారు. 

సిట్ అధికారులు ఇవాళ కేసీఆర్ ను దాదాపు 5 గంటల పాటు ప్రశ్నించారు. ఈ కేసులో నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆయనను ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

Related posts

కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ మాజీ ఎంపీ!

Ram Narayana

ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదు : ఎంపీ నామ

Ram Narayana

డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

Ram Narayana