ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

పవన్ కల్యాణ్ పై అంబటి కుమార్తె వ్యాఖ్యలు..

  • పవన్ ఇచ్చిన బలంతో తన ఇంటిపై దాడి జరిగిందన్న అంబటి కుమార్తె
  • కాపులంతా పవన్ వైపు ఉన్నారని వెల్లడి
  • కాపు మహిళలమైన తమను తిడుతూ ఇంటిపై దాడి చేశారని మండిపాటు

ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అంబటి రాంబాబుకు కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన ఉన్నారు. జైల్లో ఉన్న అంబటిని ఆయన కూతురు మౌనిక పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. 

పవన్ కల్యాణ్ ఇచ్చిన బలాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని తమ ఇంటిపై కాపులు దాడి చేశారని మౌనిక అన్నారు. కాపు కులంలో పుట్టినందుకు తాను ఎంతో గర్విస్తున్నానని చెప్పారు. కాపు కులస్తులంతా పవన్ వైపు ఉన్నారని… కాపు మహిళలమైన తమను తిడుతూ తమ ఇంటిపై దాడి చేశారని మండిపడ్డారు. చంద్రబాబు గురించి తన తండ్రి అసభ్య పదజాలంతో మాట్లాడలేదని చెప్పారు. 

జగన్ ను చంద్రబాబు ఎన్నోసార్లు తిట్టారని మౌనిక అన్నారు. తిరుమల లడ్డూ గురించి వాస్తవాలు మాట్లాడినందుకే తమ ఇంటిపై దాడి చేశారని చెప్పారు. ఆ టాపిక్ నుంచి డైవర్ట్ చేసేందుకే దాడికి దిగారని మండిపడ్డారు. తప్పుల్ని ప్రశ్నిస్తే చంద్రబాబు తల్లిని అన్నట్టుగా చెబుతూ ఇంటిపై దాడి చేశారని అన్నారు. తమ ఇంటిపై దాడి జరుగుతుంటే హోంమంత్రి అనిత ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

Related posts

కడప లోకసభ కాంగ్రెస్ అభ్యర్థి వైయస్ షర్మిలకు డిపాజిట్ గల్లంతు

Ram Narayana

షర్మిల యాత్రలో జగన్ ను ఆకాశానికెత్తిన ఓ యువకుడు… కౌంటర్ ఇచ్చిన షర్మిల

Ram Narayana

పీఠాపురం ఎన్నికల ప్రచారానికి చిరంజీవి రారనే విశ్వాసంతో ఉన్న వంగా గీత

Ram Narayana