అంతర్జాతీయం

యూరోపియన్ ఆర్మీ ఏర్పాటు ప్రమాదకరం: ఈయూ ఫారిన్ పాలసీ చీఫ్

  • అమెరికా, యూరోపియన్ యూనియన్ మధ్య విభేదాలు
  • యూరోపియన్ ఆర్మీ ఆంశంపై చర్చ
  • నాటోలో ఉన్నందున ప్రత్యేక సైన్యం సృష్టించలేరన్న కాజా కల్లాస్

యూరోపియన్ ఆర్మీ ఏర్పాటు అంశంపై ఈయూ ఫారిన్ పాలసీ చీఫ్ కాజా కల్లాస్ స్పందించారు. గ్రీన్‌లాండ్ అంశంలో అమెరికా, యూరోపియన్ యూనియన్ మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూరోపియన్ ఆర్మీ అంశంపై చర్చ సాగుతోంది. అయితే, యూరోపియన్ ఆర్మీ ఏర్పాటు చాలా ప్రమాదకరమని ఈయూ ఫారిన్ పాలసీ చీఫ్ హెచ్చరించారు. యూరోపియన్ ఆర్మీ అవసరమని చెప్పేవారు ప్రాక్టికల్‌గా ఆలోచించి ఉండరని వ్యాఖ్యానించారు.

యూరప్ దేశాలు ఇప్పటికే నాటోలో ఉన్న నేపథ్యంలో, ఒక ప్రత్యేక సైన్యాన్ని సృష్టించలేరని అన్నారు. యుద్ధం వంటి సంక్షోభ సమయాల్లో ఎవరు ఎవరికి ఆదేశాలు జారీ చేస్తారనేది ముఖ్యమైన అంశమని అన్నారు. ఒకవేళ నాటో, యూరోపియన్ ఆర్మీ రెండూ ఉంటే అప్పుడు పరిస్థితి గందరగోళంగా మారుతుందని అన్నారు. ఇది అత్యంత ప్రమాదకరమని వ్యాఖ్యానించారు.

Related posts

ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇరాన్.. అమెరికా, ఇజ్రాయెల్‌లో ఆందోళన…

Ram Narayana

బీబీసీపై డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు.. దావా వేస్తానంటూ హెచ్చరిక!

Ram Narayana

అమెరికాలో 5 ఏళ్ల బాలుడి అరెస్ట్.. తీవ్ర దుమారం

Ram Narayana