Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

యూపీ ఎన్నికల్లో సీఎం యోగిపై మాజీ పోలీసు అధికారి అమితాబ్ ఠాకూర్ పోటీ!

యూపీ ఎన్నికల్లో సీఎం యోగిపై మాజీ పోలీసు అధికారి అమితాబ్ ఠాకూర్ పోటీ!
యోగి పాలనలో అప్రజాస్వామిక నిర్ణయాలు ఎక్కువయ్యాయన్న అమితాబ్ ఠాకూర్ భార్య
యోగి ఎక్కడి నుంచి పోటీ చేసినా ప్రత్యర్థి ఠాకూరేనని స్పష్టీకరణ
సిద్ధాంతాల కోసం జరుగుతున్న పోరుగా అభివర్ణన

ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. యూపీ పీఠంపై మరోమారు జెండా ఎగరేయాలని బీజేపీ ప్రయత్నిస్తుండగా యోగిని గద్దె దింపాలని ప్రతిపక్షాలు గట్టి పట్టుదలగా ఉన్నాయి. దీంతో ఇప్పటి నుంచే యూపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కాగా, ఈ ఏడాది బలవంతపు పదవీ విరమణ ద్వారా తప్పుకున్న ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై పోటీకి రెడీ అయ్యారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.

యోగి పాలనలో అప్రజాస్వామిక చర్యలు, వివక్షాపూరిత నిర్ణయాలు ఎక్కువయ్యాయని అమితాబ్ ఠాకూర్ భార్య నూతన్ తెలిపారు. యోగి రాష్ట్రంలో ఎక్కడి నుంచి పోటీ చేసినా అక్కడి నుంచి ఆయనపై అమితాబ్ బరిలోకి దిగుతారని పేర్కొన్నారు. ఇది సిద్ధాంతాల కోసం జరుగుతున్న పోరని ఆమె తెలిపారు. కాగా, అమితాబ్ ఠాకూర్ పదవీకాలం 2028 వరకు ఉంది. అయితే, అంతవరకు కొనసాగేందుకు ఆయన ఆరోగ్య పరంగా ఫిట్‌గా లేరని పేర్కొంటూ ఈ ఏడాది మార్చిలో కేంద్రం హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది. తప్పనిసరి రిటైర్మెంట్ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన బలవంతంగా రిటైర్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది.

Related posts

హైదరాబాద్ లో మళ్లీ పోస్టర్ వార్.. ఈసారి మోదీవి!

Drukpadam

బండి సంజయ్ అద్భుతంగా మాట్లాడతారు..మోదీ ప్రశంసలు..

Drukpadam

మునుగోడు ప్రచారానికి కేసీఆర్.. మూడు రోజులు అక్కడే మకాం!

Drukpadam

Leave a Comment