జాతీయ రాజకీయ వార్తలు

తమిళనాడులో ఓటమిపై స్పందించిన స్టాలిన్…

  • ప్రజా తీర్పును గౌరవిస్తున్నామన్న డీఎంకే అధినేత
  • ఇప్పటి దాకా సమర్థ పాలన అందించాం, ఇక నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామన్న స్టాలిన్
  • జీవితంలో ఎన్నో గెలుపోటములు చూశానన్న స్టాలిన్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై డీఎంకే పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ స్పందించారు. ఆయన ఓటమిని అంగీకరించారు. తమిళనాడు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నానని అన్నారు. విజేతలకు ఆయన అభినందనలు తెలిపారు. డీఎంకే ఇక నుంచి ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ, ప్రభావవంతమైన ప్రతిపక్షంగా పనిచేస్తుందని అన్నారు.  గత ఐదేళ్ల తమ పాలనలో ప్రజల కోసం ఎన్నో ప్రాజెక్టులు చేపట్టామని, సుపరిపాలన అందించామని అన్నారు.

ఇన్నాళ్లు సమర్థవంతంగా పాలన అందించామని, ఇక నుంచి నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని పేర్కొన్నారు. తాము చేపట్టిన అభివృద్ధి పనులను చూపించి ప్రజలను ఓట్లు అడిగామని తెలిపారు. తమ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ వాటిని కొనసాగిస్తామని హామీ కూడా ఇచ్చామని అన్నారు. కానీ తీర్పు తమకు అనుకూలంగా రాలేదని అన్నారు.

తన రాజకీయ జీవితంలో అద్భుత విజయాలు చూశానని, అలాగే ఓటములను కూడా చూశానని పేర్కొన్నారు. ఇకముందు డీఎంకే రాజకీయ ప్రయాణం ఎలాంటి తడబాటు లేకుండా కొనసాగుతుందని స్టాలిన్ పేర్కొన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో  విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. డీఎంకే రెండో స్థానానికి పరిమితమైంది.

Related posts

ఆప్ ,బీజేపీ పోటాపోటీ నిరసనలు ,ర్యాలీలతో అట్టుడికిన ఢిల్లీ

Ram Narayana

ముందు మీ అవినీతి చూసుకోండని కేసీఆర్ పై మధ్యప్రదేశ్ సీఎం చౌవాన్ ఫైర్ …

Ram Narayana

ఓ వ్యాపారవేత్తకు సాయం చేసేందుకే మోదీని దేవుడు పంపారేమో: రాహుల్ గాంధీ వ్యంగ్యం

Ram Narayana