Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రాజీనామా అనంతరం సిద్దుపై నిప్పులు చెరిగిన అమరిందర్!

రాజీనామా అనంతరం సిద్దుపై నిప్పులు చెరిగిన అమరిందర్!
సిద్ధూకు పాక్ ప్రధాని, పాక్ ఆర్మీ చీఫ్ తో స్నేహం ఉంది..
అతడు సీఎం అయితే దేశానికే ముప్పు: అమరీందర్ సింగ్
పంజాబ్ కాంగ్రెస్ లో రాజకీయ సంక్షోభం
సీఎం పదవికి రాజీనామా చేసిన అమరీందర్ సింగ్
-‘సిద్ధూ సీఎంప్రతిసాదన తిరస్కరిస్తానని వెల్లడి
దేశానికి విపత్తులాంటివాడని వ్యాఖ్యలు

పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్… రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూపై విరుచుకుపడ్డారు. రాజీనామా లేఖను గవర్నర్ కు సమర్పించిన అమరీందర్ మీడియాతో మాట్లాడారు. సిద్ధూకు పాకిస్థాన్ తో సంబంధాలు ఉన్నాయని, అతడు పంజాబ్ ముఖ్యమంత్రి అయితే దేశ భద్రతకే ముప్పు అని ఆందోళన వ్యక్తం చేశారు. అతని వల్ల దేశానికి అత్యంత ప్రమాదం . అతన్ని సీఎం అభ్యర్థిగా ప్రతిపాదిస్తే తప్పకుండ వ్యతిరేకిస్తానని అమరిందర్ స్పష్టం చేశారు. రాజకీయాలను బ్రష్టుపట్టించారు. గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహించారు. ముఠాలు కట్టారు .అంతేకాదు అతనికి పాకిస్తాన్ తో సంబంధాలు ఉన్నాయి. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ , ఆర్మీ చీఫ్ తో సిద్ధుకు స్నేహం ఉంది అని శత్రుదేశమైన పాకిస్తాన్ తో వ్యక్తిగత స్నేహాలు ఏమిటని ప్రశ్నించారు.ఇది దేశద్రోహం కిందకు రాదా ? అని కాంగ్రెస్ అధిష్టానాన్ని సైతం అమరిందర్ నిలదీశారు. సిద్దు లాంటి వ్యక్తి కాంగ్రెస్ కు లాభమా ? నష్టమా? అనేది తేల్చుకోవాలని అటు సిద్దపై నిప్పులు చెరిగారు. ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. పంజాబ్ కోసం పంజాబ్ లో పార్టీ పటిష్ఠతకు తాను ఏంతో కష్టపడ్డ విషయాన్నీ గుర్తు చేశారు.

సిద్ధూకు పాక్ ప్రధానితోనూ, పాక్ ఆర్మీ చీఫ్ తోనూ స్నేహం ఉందని ఆరోపించారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూ అసమర్థుడని, పంజాబ్ కు తదుపరి సీఎం సిద్ధూ అనే ప్రతిపాదన వస్తే కచ్చితంగా తిరస్కరిస్తానని అమరీందర్ స్పష్టం చేశారు. అతడు సీఎం పీఠం ఎక్కితే దేశానికే విపత్తుగా మారే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

Related posts

జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత నాదే…మంత్రి పువ్వాడ!

Drukpadam

సీజేఐ హోదాలో తొలిసారి అమరావతి వచ్చిన జస్టిస్ ఎన్వీ రమణ… హైకోర్టులో ఘన సన్మానం

Drukpadam

తెలంగాణ పోలీసు శాఖలో కీలక మార్పు.. -ప్రభుత్వ ఆకస్మిక ఉత్తర్వులు…

Drukpadam

Leave a Comment