Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ఉద్యోగుల మెరుపు సమ్మె..భారీగా పోలీస్ బందోబస్తు..

దక్కన్ క్రానికల్ ప్రధాన కార్యాలయం ముందు ఉద్యోగుల మెరుపు సమ్మె

డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగులు బుధవారం మధ్యాహ్నం సికింద్రాబాద్ లో ప్రధాన కార్యాలయం ఎదుట మెరుపు సమ్మె కు దిగారు. ఏడాది నుంచి వేతానాలు చెల్లించడం లేదు. మూడు ఏళ్ల నుంచి వేతనాల నుంచి కట్ చేసిన పిఎఫ్ డబ్బులను ఖాతాల్లో జమ చేయకుండా స్వహా చేసిందని, రిటైర్డ్ అయిన ఉద్యోగులకు 5 ఏళ్ల నుంచి ఫైనల్ సెటిల్మెంట్ చేయడం లేదని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. యాజమాన్యం వైఖరి వల్ల ఇప్పటికే 8 మంది ఉద్యోగులు మరణించినా యాజమాన్యం స్పందించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగుల సంఘం కన్వీనర్ వెల్జాల చంద్రశేఖర్ మాట్లాడుతూ కోర్టు ఆదేశాలను కూడా యాజమాన్యం ఖాతరు చేయడం లేదని ధ్వజమెత్తారు. ఉద్యోగులు ఇటీవల నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కోర్టును ఆశ్రయించగా హైదరాబాద్ రెజులూషన్ ప్రోపేషనల్ (ఆర్ పి) మమతా బినాని ఉద్యోగులకు వెంటనే వెతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చి మాటతప్పిందని ఆరోపించారు. కోర్టు ఆదేశాల ఉల్లంఘన పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. మానవహక్కుల కమిషన్ ముందు బుధవారం హాజరు కాకుండా కేస్ NCLT లో విచారణలో ఉందని, ఇది HRC ఫరిదిలోకి రాదాని బుకాయించిందని విమర్శించారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి మమత బినాని ముఖం చాటు వేయడం పట్ల నిరసనగా తాము మెరుపు సమ్మెకు దిగినట్లు AB, DC ఎంప్లాయిస్ యూనియన్ కన్వీనర్ వెల్జాల చంద్రశేఖర్ వెల్లడించారు. ఉద్యోగుల మెరుపు సమ్మె పై యాజమాన్యం పిర్యాదు చేయటం తో నార్త్ జోన్ పోలీసులు DC కార్యాలయం ముందు భారీగా పోలీసులు మోహరించారు.

Related posts

డిజిటల్ కరెన్సీని తీసుకొస్తున్న రిజర్వు బ్యాంకు!

Drukpadam

మహారాష్ట్రలో బోణీ కొట్టిన బీఆర్ఎస్.. వార్డు ఉప ఎన్నికలో విజయం!

Drukpadam

ఎస్ఈసీ నిమ్మగడ్డకు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు

Drukpadam

Leave a Comment