Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మా అమ్మాయి పెళ్లికి రండి…దీవించండి…సీఎం కేసీఆర్ కు పొంగులేటి దంపతుల ఆహ్వానం

రండి..! దీవించండి…!!

పొంగులేటి ఇంట వివాహ వేడుకకు సీఎంకు ఆహ్వానం
కేసీఆర్‌కు శుభలేఖను అందజేసిన మాజీ ఎంపీ శ్రీనివాసరెడ్డి, మాధురి దంపతులు

పొంగులేటి ఇంట వైభవోపేతంగా అగస్టు 12న జరగనున్న కుమార్తె సప్నిరెడ్డి, అర్జున్ రెడ్డిల వివాహ వేడుకకు కుటుంబ సమేతంగా హాజరై వధూవరులిద్దరిని ఆశీర్వదించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన సతీమణి మాధురి శుక్రవారం వివాహ శుభలేఖను అందజేశారు*. *ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ను శాలువా కప్పి, పుష్పగుచ్చం తో సత్కరించారు*

అదే సందర్భంలో నిన్న ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి కి కూడా పొంగులేటి తాడేపల్లి వెళ్లి స్వయంగా ఆహ్వాన పత్రిక అందజేశారు . ఇద్దరు ముఖ్యమంత్రులతో మంచి సంబంధాలు ఉండటంతో శ్రీనివాస్ రెడ్డి ఇరువురుకి కార్డు లు అందజేశారు . శ్రీనివాస్ రెడ్డి కూతరు పెళ్లి వరంగల్ మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి మనవడు అర్జున్ రెడ్డి తో జరుగుతుంది. పెళ్లి మలేషియాలోని బాలిలో ఆగస్ట్ 12 జరగనుండగా , రిసిప్షన్ ఖమ్మంలోని ,హైద్రాబాద్ లో జరుగుతుంది . పెళ్లి పత్రికతో పాటు పొంగులేటి 5 లక్షల గోడ గడియారాలు పంపిణి చేయనున్నారు .

 

Related posts

పాతాళంలోకి ఉల్లిధర …అంధకారంలో రైతులు !

Drukpadam

ప్రారంభోత్సవం రోజున 10 స్టేషన్లలో ఆగనున్న సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలు

Drukpadam

ఎగ్జిబిషన్ సోసైటీ అధ్యక్షుడిగా ఆర్థిక మంత్రి హరీశ్ రావు

Drukpadam

Leave a Comment