సోనియా ,రాహుల్ పై ఈడీ పేరుతొ విచారణ రాజకీయ కక్ష సాధింపే …సీఎల్పీ నేత భట్టి!
-ధరలను పట్టించుకోని బీజేపీ ..ప్రభత్వాలను కూల్చుతూ రాజకీయక్రీడ ఆడుతుంది..
-బీజేపీ హటావో దేశికి బచావో తో ప్రతిగడప తొక్కుదాం
-బీజేపీ కుట్ర రాజకీయాలను బట్టబయలు చేద్దాం
-గాంధీ భవన్ సత్యాగ్రహ దీక్ష సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
సోనియా , రాహుల్ గాంధీలను ఈడీ పేరిట విచారణకు పిలవడం వేదించడమేనని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బీజేపీ సర్కారుపై ధ్వజమెత్తారు . ఈడీ ని రాజకీయాలకు వాడుకోవడం అంత్యంత దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు . తప్పు చేయకుండానే తప్పు చేశారని చెప్పటం,కోర్టులు కూడా పక్కన పెట్టిన కేసులను విచారణపేరుతో ఆఫీసుల చుట్టూ తిప్పడం కాంగ్రెస్ కార్యకర్తలే కాకుండా సామాన్యులు సైతం అవాక్కు అవుతున్నారని మండిపడ్డారు .
దేశంలో ప్రతిపక్షాలు, ప్రజాస్వామ్యం, ప్రజల పక్షాన పోరాటాలు చేసే వారు లేకుండా చేయాలని కుట్రలో భాగంగానే సోనియా, రాహుల్ గాంధీలపై అక్రమ కేసులన్నారు .ఈడితో విచారణ పేరిట వేధింపులకు పాల్పడుతున్నారు దీని గురించి దేశప్రజలు ఆలోచించాలి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు . .మోడీ పాలనలో ఆకాశాన్ని నిత్యవసర వస్తువుల ధరలు, పెరిగిన పెట్రోల్ డీజిల్, చివరకు పసిపిల్లలు తాగే పాలపైన కూడా జిఎస్టి విధించడంతో ప్రజలు తీవ్రమైన దుఃఖంలో ఉన్నారని విమర్శలు గుప్పించారు . .
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని అధికారంలోకి వచ్చిన మోడీ గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటుచేసిన ప్రభుత్వ రంగ సంస్థలను ఇతర సంపదను అమ్మివేస్తూ ఉద్యోగ అవకాశాలు లేకుండా చేయడంతో నిరాశతో యువత ఆత్మహత్య చేసుకొనే పరిస్థితుల్లో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు .మోడీ ప్రభుత్వం 80 లక్షల కోట్ల అప్పులు చేసి దేశాన్ని తాకట్టు పెడుతున్న విషయాన్నీ గుర్తు చేశారు .
బీజేపీ అనేది మల్టీ నేషనల్ కంపెనీ లాంటి పార్టీ అని ప్రభుత్వ రంగ సంస్థలను తమకు కావలసిన వాళ్ళకి మోడీ అమ్మేస్తున్నారని దుయ్యబట్టారు . మేమిద్దరం, మాకిద్దరు లాగా, మోదీ అమిత్ షా కి, అదానీ అంబానీలు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు .
నేషనల్ హెరాల్డ్ కేసులో ఏమీ లేదని మూసేసిన కేసును మళ్ళీ ఓపెన్ చేశారన్నారు .కక్షపూరితంగా సోనియా రాహుల్ గాంధీ లను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోంమని హెచ్చరించారు .ఈ నిరసన దీక్ష కేవలం సోనియా, రాహుల్ కోసమే కాదు. కోట్లాది ప్రజల కోసం. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమని అన్నారు .బ్రిటిష్ ప్రభుత్వాన్ని దేశం నుండి ఏవిధంగా పారద్రోలమో,అలాగే బీజేపీని కుల్చుతాం. బిజెపిని దేశం నుంచి పారద్రోలే వరకు కాంగ్రెస్ పోరాటం ఆగదన్నారు.
సోనియా ధిరోదాత్తురాలు. ప్రధాని పదవిని త్యాగం చేసిన సోనియా దేశ అభ్యున్నతి కోసం పనిచేసింది కొనియాడారు .కాంగ్రెస్ పనిచేసేది అధికారం కోసం కాదు. సామాజిక మార్పు కోసం గుర్తుంచుకోవాలని అన్నారు . నేషనల్ హెరాల్డ్ పత్రిక కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పత్రికకి కాంగ్రెస్ పార్టీ డబ్బులను అప్పుగా ఇచ్చింది. ఇందులో ఎక్కడ మనీ ల్యాండ్రింగ్ జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు . .
రాహుల్, సోనియాకి మద్దతుగా నిలిచి దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు . దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీగా నవభారత నిర్మాణం చేసిన కాంగ్రెస్ పార్టీగా దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మాపై ఉందన్నారు .కాంగ్రెస్ నాయకులం, కార్యకర్తలం గ్రామాలకు వెళ్దాం. ఇంటిటికి వెళ్లి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, వారి అవినీతి పాలన గురించి ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రచారం చేద్దాం .హైదరాబాద్ వదిలి పల్లెలకి బయలుదేరుదాం.కాంగ్రెస్ జెండాని ప్రతి ఇంటిపై ఎగరేయడానికి కథం తొక్కుదాం. అని పిలుపునిచ్చారు . కార్యక్రమంలో జానారెడ్డి ,పొన్నాల , సీతక్క , ఇతర నాయకులూ పాల్గొన్నారు .