Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఖమ్మం లో మంకీ ఫాక్స్ కలకలం…?

ఖమ్మం లో మంకీ ఫాక్స్ కలకలం…?
యూపీకి చెందిన వ్యక్తికి లక్షణాలు
ఇక్కడ గ్రానైట్ ఫాక్టరీ లో పనిచేస్తున్న సందీప్
ఆందోళనలో ప్రజలుభయపడొద్దన్న వైద్యాధికారులు

ఖమ్మం జిల్లాలో మంకీ ఫాక్స్ లక్షణాలతో ఒక వ్యక్తి హాస్పత్రి లో చేరారు . అతనికి లక్షణాలు మంకీ ఫాక్స్ లక్షణాలు పొలిఉన్నాయని గుర్తించిన స్థానిక వైద్యులు వెంటనే జిల్లా వైద్యాధికారి సలహామేరకు హైద్రాబాద్ తరలించారు .

తెలంగాణాలో ఇది రెండవ కేసు కావడం గమనార్హం . అయితే టెస్టు రిపోర్ట్ వస్తే తప్ప. అది మంకీ ఫాక్స్ అవునా? కదా? చెప్పలేమని అంటున్నారు అధికారులు. ఖమ్మం జిల్లాలో మొదటి మంకీ ఫాక్స్ లక్షణాలు ఉన్న వ్యక్తి గుర్తించడంతో ఆందోళన బయలుదేరింది. ఉత్తరప్రదేశ్ కి చెందిన సందీప్ అనే వ్యక్తి ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల గ్రానైట్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పని చేస్తున్నాడు……

హైదరాబాద్ తరలింపు …

ఖమ్మం జిల్లాలో మొదటి మంకీ ఫాక్స్ లక్షణాలు ఉన్న వ్యక్తి గుర్తింపు అతన్ని హైద్రాబాద్ తరలింపుకు డి ఎం ఎచ్ ఓ చర్యలు చేపట్టారు . ఉత్తరప్రదేశ్ కి చెందిన సందీప్ అనే వ్యక్తి ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల గ్రానైట్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పని చేస్తున్నాడు.ఇతని చేతిపై దద్దులు రావడంతో మంకీ ఫాక్స్ లక్షణాలు అంటుకుంటున్నారు . అసలే కరోనతో బయపడుతూన్నవేళ కొత్తగా మంకీ ఫాక్స్ కేసు రావడం ప్రపంచ వ్యాపితంగా దీనిపై చర్చ జరగటంతో దీనిపై చర్యలకు అధికారులకుడా పూనుకున్నారు . రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు కూడా దీనిపై ఆరాతీశారు . మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ కూడా రంగంలోకి దిగారు . ఆయనకు దగ్గరగా ఉన్నవారిని కూడ పరీక్షంచాలని నిర్ణయించారు.

 

Related posts

సీనియర్ పువ్వాడ ను పరామర్శించిన మంత్రి హరీష్ రావు..

Drukpadam

బిపిన్ రావత్ మంచి నీళ్లు అడిగారు.. ఆయనకు నీళ్లు కూడా ఇవ్వలేకపోయాం: ప్రత్యక్ష సాక్షి కంటతడి!

Drukpadam

పాకిస్థాన్‌లో భారీ భూకంపం.. స్టూడియో ఊగిపోతున్నా వార్తలు చదవడం ఆపని యాంకర్.. !

Drukpadam

Leave a Comment