రాజా సింగ్‌పై పీడీ యాక్ట్ కేసు.. చర్లపల్లి జైలుకు తరలింపు
- మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజా సింగ్
- 41 సీఆర్పీసీకి కింద రాజా సింగ్‌కు నోటీసుల అందజేత
- ఆపై ఆయనను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచిన పోలీసులు
- జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు
వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సస్పెన్స్కు గురైన గోషామహల్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యేల రాజాసింగ్ ను పోలీసులు వూహాత్మకంగా అరెస్ట్ చేశారు .నిన్నటి రోజున పోలీసులు రేమండ్ రిపోర్ట్ పొరపాటుగా ఉండటంతో ఆయనకు బైలు ఇచ్చిన కోర్ట్ గురువారం ఉదయం చేసిన అరెస్ట్ పకడ్బందీగా ఉండటంతో జ్యూడిషల్ కస్టడీ విధించి చర్లపల్లి జైలుకు తరలించారు .
రాజా సింగ్ అరెస్ట్, కోర్టుకు తరలింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు ఉన్నతాధికారులు భారీ బలగాలను మోహరించారు. బుధవారం నాడు చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా రాజా సింగ్‌కు 41సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చాక పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తొలుత రాజా సింగ్‌ను రహస్య ప్రాంతానికి తరలిస్తున్నట్లుగా చెప్పిన పోలీసులు… ఆ తర్వాత వ్యూహం మార్చి నాంపల్లి కోర్టుకు తరలించారు.