Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

హీరో నాగార్జున వ్యాఖ్యలపై సెటైర్లు వేసిన సీపీఐ నారాయణ!

హీరో నాగార్జున వ్యాఖ్యలపై సెటైర్లు వేసిన సీపీఐ నారాయణ
-ముందు నుంచి కూడా బిగ్ బాస్ పై విమర్శలు గుప్పిస్తున్న నారాయణ
-నాగార్జున కనుసన్నల్లో కొనసాగుతున్న బూతుల స్వర్గం అంటూ విమర్శ
-పెళ్లయిన వాళ్లకు శోభనం గదిని ఏర్పాటు చేశారని తాజాగా సెటైర్లు

బిగ్ -బాస్ రియాలిటీ షో దీనిపై భిన్న అభిప్రాయాలూ ఉన్నాయి. ఏది కేవలం ఎంటటైన్మెంట్ కోసం చేస్తున్న షో గా నిర్వాకులు చెపుతుండగా …ఇది పచ్చి బూతుల షోగా ఉండనే విమర్శలు ఉన్నాయి. సిపిఐ కి చెందిన నారాయణ షోకు యాంకర్ గా చేస్తున్న అక్కినేని నాగార్జునని టార్గెట్ గా చేసుకొని విమర్శలు గుప్పిస్తున్నారు . నారాయణ మాటలతో ఏకీభవించేవారు చెలమంది ఉన్నారు . అదే సందర్భంలో యువతలో దీనిపట్ల క్రేజీ ఉంది. ఇందులోకి తీసుకొనే వాళ్లకు రోజుకు ఇంత అనే రేట్ నిర్ణయిస్తారు . దాని ప్రకారం వాళ్ళను ఎలిమినేటి చేస్తారనే గుసగుసలు ఉన్నాయి. అందులో వాళ్ళు ప్రవర్తించే తీరు పై అభ్యంతరాలు ఉన్నాయి.

బిగ్ బాస్ రియాల్టీ షోపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ముందు నుంచి కూడా విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ‘హీరో నాగార్జున కనుసన్నల్లో కొనసాగుతున్న బూతుల స్వర్గం బిగ్ బాస్’ అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు గత శనివారం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో నాగార్జున మాట్లాడుతూ… హౌస్ లో ఉన్న భార్యాభర్తలు మరీనా, రోహిత్ లను హగ్ చేసుకోమని అన్నారు. అంతేకాదు… తనను విమర్శించిన నారాయణను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ‘నారాయణ.. నారాయణ.. వాళ్లు పెళ్లయినవాళ్లు’ అని అన్నారు.

ఈ వ్యాఖ్యలపై నారాయణ తనదైన శైలిలో స్పందించారు. ‘నాగన్నా.. నాగన్నా.. బిగ్ బాస్ షోలో పెళ్లయిన వాళ్లకి శోభనం గదిని ఏర్పాటు చేశారన్నా. మిగిలిన వాళ్లు ఏమైనారు అన్నా?’ అని నారాయణ సెటైర్ వేశారు. ఈ వ్యాఖ్యలపై నాగార్జున ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Related posts

రాచరికానికి బ్రిటన్ యువరాజు హ్యారీ-మేఘన్ దంపతుల గుడ్‌ బై!

Drukpadam

మా ప్రేమకు 15 ఏళ్లు.. పెళ్లి చేసుకుంటాం అనుమతివ్వండి: సుప్రీంకోర్టుకెక్కిన యువకులు!

Drukpadam

దిశా కేసులో విచారణ కమిషన్ ముందు సజ్జనార్ వాంగ్మూలం

Drukpadam

Leave a Comment