Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

అమ‌రావ‌తి అసైన్డ్ భూముల స్కాం నిందితుల‌కు రిమాండ్ తిర‌స్క‌రించిన కోర్టు!

అమ‌రావ‌తి అసైన్డ్ భూముల స్కాం నిందితుల‌కు రిమాండ్ తిర‌స్క‌రించిన కోర్టు!

  • అమ‌రావ‌తి ప‌రిధిలో అసైన్డ్ భూముల స్కాం జ‌రిగింద‌న్న సీఐడీ
  • ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసిన వైనం
  • వారిలో ఇద్ద‌రిని ఏసీబీ కోర్టులో హాజ‌రుప‌ర‌చిన సీఐడీ
  • నింద‌తులను రిమాండ్‌కు త‌ర‌లించేందుకు తిర‌స్క‌రించిన న్యాయ‌మూర్తి
  • నిందితుల‌పై న‌మోదు చేసిన సెక్ష‌న్లు చెల్ల‌వ‌ని వెల్ల‌డి
  • సీఆర్పీసీ 41ఏ ప్ర‌కారం నోటీసులు ఇవ్వాల‌ని సీఐడీకి ఆదేశం

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌రిధిలో అసైన్డ్ భూముల కుంభ‌కోణానికి సంబంధించి మంగ‌ళ‌వారం ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన నిందితుల‌కు రిమాండ్ విధించేందుకు కోర్టు నిరాక‌రించింది. ఈ కేసులో మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో సీఐడీ అధికారులు కొల్లి శివ‌రాం, గ‌ట్టెం వెంక‌టేశ్‌, చిక్కాల విజ‌య‌సార‌థి, బ‌డే ఆంజ‌నేయులు, కొట్టి దొర‌బాబుల‌ను అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే.

అరెస్ట్ చేసిన ఐదుగురిలో కొల్లి శివ‌రాం, గ‌ట్టెం వెంక‌టేశ్‌ల‌ను సీఐడీ అధికారులు మంగ‌ళ‌వారం రాత్రి ఏసీబీ కోర్టులో హాజ‌రుప‌రిచారు. అయితే నిందితులిద్ద‌రినీ రిమాండ్‌కు త‌ర‌లించేందుకు ఏసీబీ కోర్టు న్యాయ‌మూర్తి తిర‌స్క‌రించారు. నిందితుల‌పై న‌మోదు చేసిన రెండు సెక్ష‌న్లు వారికి వ‌ర్తించ‌వ‌ని జ‌డ్జీ తేల్చి చెప్పారు. కొల్లి శివ‌రాం, గ‌ట్టెం వెంక‌టేశ్‌ల‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు చెల్ల‌ద‌న్న న్యాయ‌మూర్తి…మిగిలిన సెక్ష‌న్ల ప్ర‌కారం ఏడేళ్ల జైలు శిక్ష ప‌డే అవ‌కాశ‌ముంద‌ని తెలిపారు. అంతేకాకుండా నిందితుల‌కు సీఆర్పీసీ 41ఏ ప్ర‌కారం నోటీసులు ఇవ్వాల‌ని సీఐడీ అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు.

అమ‌రావ‌తి అసైన్డ్ భూముల కుంభ‌కోణంలో ఐదుగురిని అరెస్ట్ చేసిన సీఐడీ!

  • అమ‌రావ‌తి ప‌రిధిలో అసైన్డ్ భూముల విక్ర‌యాల‌పై సీఐడీ కేసు న‌మోదు
  • 1,100 ఎక‌రాల్లో 169.27ఎక‌రాల విక్ర‌యాల‌కు నిందితులు స‌హ‌క‌రించార‌న్న సీఐడీ
  • నిందితుల‌కు రామ‌కృష్ణ హౌసింగ్ డైరెక్టర్ ఖాతా నుంచి రూ.15 కోట్లు అందాయ‌ని వెల్ల‌డి

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలోని అసైన్డ్ భూముల‌కు సంబంధించిన కుంభ‌కోణంపై ద‌ర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు మంగ‌ళ‌వారం ఓ కీల‌క అడుగు వేశారు. ఈ కుంభ‌కోణంతో సంబంధం ఉందంటూ తాజాగా ఐదుగురు వ్య‌క్తుల‌ను అరెస్ట్ చేశారు. సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన వారిలో కొల్లి శివ‌రాం, గ‌ట్టెం వెంక‌టేశ్‌, చిక్కాల విజ‌య‌సార‌థి, బ‌డే ఆంజ‌నేయులు, కొట్టి దొర‌బాబు ఉన్నారు.

ఈ కుంభ‌కోణంలో 1,100 ఎక‌రాల అసైన్డ్ భూములు చేతులు మారిన‌ట్లు సీఐడీ ఆరోపిస్తోంది. ఇందులో 169.27 ఎక‌రాల విక్ర‌యాల‌కు సంబంధించి ఈ ఐదుగురు కీల‌క పాత్ర పోషించిన‌ట్లు సీఐడీ తెలిపింది. మాజీ మంత్రి నారాయ‌ణ‌తో పాటు ఆయ‌న స‌మీప బంధువుల ఆధ్వ‌ర్యంలో ఈ భూముల విక్ర‌యాలు జ‌రిగాయ‌ని, ఈ విక్ర‌యాల్లో ఈ ఐదుగురు నిందితులు కీల‌కంగా వ్య‌వ‌హ‌రించార‌ని ఆరోపించింది. ఇందుకు గాను వీరికి రామ‌కృష్ణ హౌసింగ్ డైరెక్ట‌ర్ ఖాతాల నుంచి రూ.15 కోట్లు అందిన‌ట్లు ఆధారాలు ల‌భించాయ‌ని సీఐడీ తెలిపింది.

Related posts

ఐఐటీ విద్యార్థినిపై బీజేపీ కార్యకర్తల లైంగిక వేధింపులు ….!

Ram Narayana

విజయవాడలో ఒకే వ్యక్తికి 658 సిమ్‌కార్డులు.. విచారణకు ఆదేశం

Ram Narayana

కిలాడి లేడీ ప్రముఖులకు వల…గుర్తించి కటకటాల్లోకి పంపిన పోలీసులు…

Drukpadam

Leave a Comment