రాజకీయ వార్తలు

కేంద్ర హోమ్ మంత్రికి స్వాగతం పలికిన పొంగులేటి సుధాకర్ రెడ్డి …!

కేంద్ర హోమ్ మంత్రికి స్వాగతం పలికిన పొంగులేటి సుధాకర్ రెడ్డి …!
శాలువాతో అమిత్ షా ను సత్కరించిన పొంగులేటి
హైద్రాబాద్ చేరుకున్న కేంద్ర హోమ్ మంత్రి
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న పలువురు బీజేపీ నేతలు
కేంద్ర మంత్రికి స్వాగతం పలికిన బండి సంజయ్ ,కిషన్ రెడ్డి , రాజగోపాల్ రెడ్డి , మర్రి శశిధర్ రెడ్డి …

కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా బీజేపీ చేవెళ్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనేందుకు ఆదివారం సాయంత్రం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు . ఎయిర్ పార్టీ లో ఆయన బీజేపీ నాయకులు తమిళనాడు రాష్ట్ర బీజేపీ వ్యవహారాల సహా ఇంచార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి  ప్రత్యేక నిలిచారు . అమిత్ షా కు స్వాగతం పలికి , శాలువాతో సత్కరించారు . ఈ సందర్భంగా క్యా సుధాకర్ రెడ్డిజి అని అమిత్ షా ఆప్యాయంగా పలకరించారు . అమిత్ రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు . అమిత్ షా షడ్యూల్ చాల టైట్ గా ఉండటంతో కొంత మంది ముఖ్యనేతలను మాత్రమే విమానాశ్రయానికి అనుమతించారు . అమిత్ షా కు స్వాగతం పలికినవారిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ , కేంద్రమంత్రి కిషన్ రెడ్డి , మర్రి శశిధర్ రెడ్డి , కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు . అక్కడే నోవొటెల్ హోటల్ లో ఆయన బీజేపీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు . దాని తర్వాత అక్కడ నుంచి దగ్గరలోనే ఉన్న చేవెళ్లకు రోడ్ మార్గంలో బయలు దేరు వెళ్లారు ….

Related posts

మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తే.. ఏపీ, తెలంగాణలో మహిళలకు దక్కే సీట్లు ఎన్నంటే..!

Ram Narayana

అమిత్ షా, బీరేన్‌సింగ్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ పార్టీని వీడిన మిజోరం బీజేపీ వైస్ ప్రెసిడెంట్…

Drukpadam

టికెట్ ఇవ్వకుంటే కారు దిగేస్తానన్న మాజీ ఎమ్మెల్యే…తీగల కృష్ణారెడ్డి వార్నింగ్.

Drukpadam