Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మీడియాను అగౌరవ పర్చడం సరైంది కాదు

మీడియాను అగౌరవ పర్చడం సరైంది కాదు -ఐజేయూ, టీయుడబ్ల్యుజె
-నూతన సెక్రటేరియట్ ప్రారంభానికి స్థానిక మీడియా పై కేసీఆర్ ప్రభుత్వం వివక్ష
-జాతీయ మీడియాను ఆహ్వానించి స్థానిక మీడియా ను విస్మరించడం దారుణం
-నూతన సచివాలయంలో అని సౌకర్యాలతో మీడియా పాయింట్ ఏర్పాటు చేయాలి…

నూతన సచివాలయం రాష్ట్రానికి తలమానికంగా ఉండడం శుభ పరిణామమని, మీడియాను అగౌరవ పరిచే ప్రభుత్వ వైఖరి మాత్రం సరైంది కాదని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ తెలంగాణ ప్రభుత్వ వైఖరిని  తప్పుపట్టింది ..ఈమేరకు (ఐజేయూ) అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కే. విరాహత్ అలీ లు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు .
సచివాలయమంటే అన్ని రంగాలకు ఉపయోగపడే ఒక పవిత్ర దేవాలయంగా ఉండాలి . అందుకు విరుద్ధంగా ప్రభుత్వ చర్యలు ఉండటం దురదృష్టకరం . చట్ట సభల్లోనే మీడియాకు గ్యాలరీ ఉంటుంది .అలాంటిది పరిపాలన కేంద్రంలో ఫోర్త్ ఎస్టేట్ గా పిలువబడే మీడియాకు సముచిత స్థానం లేకపోవడం విచారకరమన్నారు. పరిపాలనకు, ప్రజల సంక్షేమానికి ఉపయోగపడే నిర్ణయాలకు, ప్రజలు తెలుసుకునే హక్కును కాపాడటానికి సచివాలయం తోడ్పడాలనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని వారు సూచించారు. సమాచార సేకరణ కోసం జర్నలిస్టులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకు కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం మంచి మీడియా సెంటర్ ను ఏర్పాటు చేసిందని వారు గుర్తుచేశారు.

సచివాలయ ప్రారంభోత్సవ కవరేజీకి

కోట్ల రూపాయలు ఖర్చు చేసి, ఇతర రాష్ట్రాల మీడియాను ఆహ్వానించిన ప్రభుత్వం, తెలుగు మీడియాను అవమానించడంలో అంతర్యమేమిటన్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని వారు కోరారు. అక్రెడిషన్ కార్డులు కేవలం బస్సుల్లో, రైళ్లలో రాయితీల కోసం మాత్రమే జారీ చేసినవి కావని, జర్నలిస్టుగా గుర్తింపు, ప్రభుత్వ రంగంలో స్వేచ్ఛగా సమాచార సేకరణకు అవి జారీచేయబడిన అసలు ఉద్దేశ్యాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు.
ఇంత ఘనంగా ప్రారంభించిన కార్యక్రమంలో రాష్ట్ర పాత్రికేయులను అవమానించే వైఖరిని అనుసరించడం సరైంది కాదని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంలో స్పందించాలని వారు కోరారు.
నూతనంగా ఏర్పాటైన సచివాలయంలో సమాచార సేకరణకు అవసరమైన సౌకర్యాలతో మీడియా పాయింట్ ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వారు సూచించారు.

Related posts

పెన్ష‌న‌ర్ల‌కు గుడ్‌న్యూస్‌ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం!

Drukpadam

Meet The Women At The Head of The Gym Revolution

Drukpadam

తెలంగాణలో లేకపోతే నాపై రాజద్రోహం కేసు పెట్టేవారేమో: ప్రొఫెసర్ నాగేశ్వర్!

Drukpadam

Leave a Comment