కర్ణాటక ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటలు …అభ్యర్థులో లబ్ డబ్…
-కాంగ్రెస్ గెలుస్తుందన్న సర్వే లు …మేమె గెలుస్తామంటున్న బీజేపీ
-కింగ్ మేకర్ కాదు ..కింగ్ లమే అంటున్న జేడీఎస్
-గ్రామీణ కర్ణాటకలో అధిక శాతం ఓటింగ్ ….
-ఓటింగ్ లో మహిళలు అధికంగా పాల్గొన్నట్లు చెపుతున్న సర్వే లు
కర్ణాటక ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. దీంతో అన్ని పార్టీల్లోని పోటీలో ఉన్న అభ్యర్థుల్లో గుండెలు లబ్ డబ్ మంటూ అతి వేగంగా కొట్టుకుంటున్నాయి. ఫలితాల కోసం దేశం యావత్తు ఎదురు చూస్తున్నది. ప్రధాని మోడీకి ఈ ఎన్నికలు కీలకం కానుండగా ,కాంగ్రెస్ లోని రాహుల్ ,ప్రియాంక ల ఛరిస్మాలకు ఇది పరీక్షగా నిలవబోతుంది. మొదటిసారి రాహుల్ ,ప్రియాంక తోపాటు సోనియా గాంధీ కూడా తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ఒక సభలో పాల్గొన్నారు . ఇక ఇదే రాష్ట్రానికి చెందిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే విస్తృతంగా ప్రచారం చేశారు . ఇక మాజీ సీఎం సిద్దరామయ్య , కర్ణాకట కాంగ్రెస్ అధ్యక్షడు డీకే శివకుమార్ లు పకడ్బందీ ప్రచారం నిర్వహించారు .
బీజేపీ తరుపున ప్రధాని నరేంద్ర మోడీ , కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా , బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా లు చేసిన ప్రచారం బీజేపీ శ్రేణులనూ కదిలించింది. ప్రధాని రోడ్ షో లు బహిరంగ సభలు కొంత ప్రభావం చూపినప్పటికీ ,బీజేపీ ప్రభుత్వం మీద అవినీతి మరకలు ఆ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలూ ఉన్నాయి.
తాము 141 సీట్లు గెలుస్తామని డీకే శివకుమార్ ధీమా…
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ ధీమా వ్యక్తం చేశారు. అలాగే తమ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి కావాలనే నిర్ణయాన్ని కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. సిద్ధరామయ్య, శివకుమార్ ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. దీంతో మీడియా ప్రతినిధులు సీఎం ఎవరని ప్రశ్నించగా ఆయన పైవిధంగా స్పందించారు. సీఎం వ్యవహారంలో ఆ ముగ్గురిదే నిర్ణయమన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో తాము 141 సీట్లలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఏజెన్సీల కన్నా తమ సర్వేలో సేకరించిన శాంపిల్స్ సంఖ్య అధికంగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రతి మూలకు వెళ్లానని ఆయన చెప్పారు. ఎన్ని సీట్లు వచ్చినా దాంతో సంబంధం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది మాత్రం తామేనని బీజేపీ నేతలు చెబుతున్నారని, కానీ అది వారి భ్రమేనని అన్నారు.
డీకే శివకుమార్ ను రేపటి వరకు ఆ ఆనందంలో ఉండనిద్దాం: కర్ణాటక సీఎం బొమ్మై సెటైర్
యావత్ దేశం ఉత్కంఠగా వేచి చూస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. మరోవైపు తమకు క్లియర్ మెజార్టీ వస్తుందనే ధీమాను ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లు వేటికవే వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ, హంగ్ వచ్చే అవకాశమే లేదని చెప్పారు. సంపూర్ణ మెజార్టీతో తాము మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు.
కాంగ్రెస్ కు 141 సీట్ల వస్తాయని పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ చెపుతున్నారని, రేపటి వరకు ఆయనను ఆ ఆనందంలో ఉండనిద్దామని ఎద్దేవా చేశారు. బీజేపీ గెలిస్తే సీఎం ఎవరుండాలనే దాన్ని శాసనసభాపక్ష సమావేశంలో నిర్ణయిస్తామని అన్నారు.
మరోవైపు మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప నివాసానికి బొమ్మైతో పాటు పార్టీకి చెందిన కీలక నేతలు వెళ్లారు. రేపు కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో వీరు భేటీ అయ్యారు.