బీజేపీతో సరిపడదు …. పార్టీ మార్పు పై కేంద్ర మాజీమంత్రి రేణుక చౌదరి !
-కాంగ్రెస్ తోనే తన ప్రయాణమన్న రేణుకాచౌదరి
-తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని ప్రకటన
-పార్టీ నిర్ణయాలు శిరసావహిస్తా ….
ఫైర్ బ్రాండ్ రేణుకాచౌదరి మరోసారి వార్తల్లోకి ఎక్కారు … ఆమె కాషాయం కండువా కప్పుకోబోతున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆమె ఘాటుగా స్పందించారు . ఇదిఎక్కడ నుంచి వచ్చింది….తాను బీజేపీలోకి వెళ్లడం ఏమిటి …?కేంద్రమంత్రి పదవి ఇస్తామన్న చేరలేదు ..బీజేపీతో నా మైండ్ సెట్ కాదు …జరుగుతున్న ప్రచారం అబద్దం … . ఆవార్తలు ఎక్కడ నుంచి వచ్చాయో తెలియదని కొట్టి పారేశారు . కాంగ్రెస్ కు నేను నిజమైన సైనికురాలుని , ఈదేశం కోసం నా తండ్రి పనిచేశారు . కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలను శిరసావహిస్తా …. కాంగ్రెస్ తోనే తన ప్రయాణం అని స్పష్టం చేశారు . దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ ….అనేక ప్రాజక్టులు , పరిశ్రమలు , ప్రజల సంక్షేమం దేశ అభివృద్ధి , ఇతర దేశాలతో దౌత్య సంబంధాలు కాంగ్రెస్ హయాంలోనే బాగున్నాయి. స్వతంత్ర పోరాటంలో ఎలాంటి పాత్ర పోషించని బీజేపీ అధికారంలో ఉంది . మతాలు ,కులాలు ,ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి అధికారాన్ని పొందిన పార్టీ నేను లౌకికవాదిని, బీజేపీ విధానాలు నాకు అసలు సరిపడవు …అందువల్ల నాప్రాణం ఉన్నంతకాలం కాంగ్రెస్ తోనే అని అన్నారు .