Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలురాజకీయ వార్తలు

బీఆర్ యస్ ,కమ్యూనిస్టుల మధ్య పొత్తు పై ముందుకు పడని అడుగులు …!

బీఆర్ యస్ ,కమ్యూనిస్టుల మధ్య పొత్తు పై ముందుకు పడని అడుగులు …!
కమ్యూనిస్టులు సానుకూలంగా ఉన్నా, స్పష్టం కానీ బీఆర్ యస్ వైఖరి
బీఆర్ యస్ సాచివేత ధోరణితో పునరాలోచనలో కామ్రేడ్స్
40 నియోజకవర్గాల్లో ప్రభావం చూపుతామంటున్న కమ్యూనిస్టులు
ఏ పార్టీతో పొత్తు లేకుండా బరిలో దిగే యోచన దిశగా ఆలోచనలు
రెండు పార్టీల్లో బీఆర్ యస్ వైఖరిపై తీవ్ర అసంతృప్తి

కమ్యూనిస్టులు, బీఆర్ యస్ మధ్య తెలంగాణాలో పొత్తు ఉంటుందని నిన్నమొన్నటివరకు ప్రచారం జరిగింది… ఇటు లెఫ్ట్ పార్టీలు , అటు బీఆర్ యస్ లు బీజేపీ వ్యతిరేక పోరాటంలో కలిసి నడచి అనివార్యమైనా పరిస్థితులు ఉన్నాయని ప్రచారం జరిగింది… బీజేపీ వ్యతిరేక పోరాటంలో కమ్యూనిస్టులు ఇచ్చిన ఆఫర్ ను బీఆర్ యస్ పట్టించుకున్నట్లు కనిపించడంలేదు . దీంతో పొత్తు ముచ్చట్లు అడుగులు ముందుగు సాగడంలేదు … సిపిఎం , సిపిఐ పార్టీల ఐక్యంగా ,విడివిడిగా అనేక సార్లు సమావేశాలు జరిపి తమ వైఖరిని సీఎం కేసీఆర్ కు తెలియజేయాలని భావించాయి. అందుకోసం ఆయన సమయాన్ని అడిగాయి. రోజులు,వారాలు, నెలలు గడుస్తున్నప్పటికీ అటునుంచి సమాధానం సరిగాలేకపోవడంతో కమ్యూనిస్ట్ నేతలు తర్జనభర్జనలు జరుపుతున్నారు .. తమవైపు నుంచి ఉన్న శ్రద్ద , చొరవ బీఆర్ యస్ నుంచి కనిపించకపోవడంపై కామ్రేడ్స్ ఆలోచనలో పడ్డారు .. కలిసి పనిచేద్దామని అంటూనే సాచివేత ధోరణి అవలంబించడం పట్ల కమ్యూనిస్టులు అసహనంతో ఉన్నారు ..

మునుగోడు ఎన్నికల సందర్భంగా బీజేపీ అభ్యర్థిని ఓడించేందుకు అక్కడ నిర్మాణాత్మకమైన బలమున్న కమ్యూనిస్టుల సహకారం అవసరం అయింది . అప్పడు స్వయంగా సీఎం కేసీఆర్ రెండు పార్టీల రాష్ట్ర కార్యదర్శులకు స్వయంగా ఫోన్ చేసి వారిని ప్రగతి భవనం కు పిలిపించుకొని ప్రేమ పూర్వక విందు సమావేశాలు జరిపారు ….వారితో నిరంతరం టచ్ లో ఉండి తమ అభ్యర్థిని గెలిపించుకున్నారు . నిజంగా అక్కడ కమ్యూనిస్టుల సహకారం లేకపోతె బీఆర్ యస్ అభ్యర్థి గెలిచేవాడుకాదని ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి.

కమ్యూనిస్టుల ఓట్లతోనే మునుగోడులో బీఆర్ యస్ ఓటమి గండం నుంచి బయట పడ్డది…ఆ విషయాన్నీ బీఆర్ యస్ నేతలు కూడా అంగీకరించారు … నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీష్ రెడ్డి స్వయంగా సిపిఎం , సిపిఐ కార్యాలయాలకు వెళ్లి మునుగోడులో మీ సహకారం వల్లనే గెలిచామని …ఇది ముందు ముందు కూడా కొనసాగిద్దామని సీఎం కేసీఆర్ మాటగా చెప్పారు . బీజేపీ వ్యతిరేక పోరాటంలో కలిసి వస్తున్న బీఆర్ యస్ ను బలపరిచే ఉద్దేశంతో తమపై అనేక విమర్శలు వచ్చినప్పటికీ విస్తృత ప్రయోజాల దృష్ట్యా బీఆర్ యస్ తో కల్సి ప్రయాణం చేయాలనీ అనుకున్నారు …బీఆర్ యస్ పై ఈగ వాలకుండా ప్రత్యేకించి బీజేపీపై విమర్శల జడివాన కురిపించారు . కొన్ని సందర్భాల్లో తమ పార్టీ నుంచి వస్తున్న అంతర్గత విమర్శలను సైతం పక్కన పెట్టి బీఆర్ యస్ కు స్నేహ హస్తం ఇవ్వాలని వారితోనే కలిసి పోటీచేస్తామని, ఒక్కసారి కాదు అనేక సార్లు రెండు కమ్యూనిస్ట్ పార్టీలు ప్రకటించాయి … ఇదే విషయాన్నీ బీఆర్ యస్ ముఖ్యనేతలైన కేటీఆర్ , హరీష్ రావు , సంతోష్ , పల్లా రాజేశ్వర్ రెడ్డి ల దృష్టికి తీసుకోని వెళ్లారు … వారు కల్సి మాట్లాడదాం అంటూనే కమ్యూనిస్టులపై విమర్శలకు పూనుకున్నారు .మంత్రి హరీష్ రావు ఆశావర్కర్ల సమావేశంలో మాట్లాడుతూ కమ్యూనిస్టుల మాటలు నమ్మవద్దని , వారికీ ఓట్లు లేవు …ప్రజా బలం లేదని పేర్కొనడం కమ్యూనిస్టుల ఆగ్రహానికి కారణమైంది. కమ్యూనిస్టుల నుంచి అభ్యంతరాలు రావడంతో, దానిపై హరీష్ రావు నాలుక కరుచుకున్నారని సమాచారం … తనమాటలు ఫ్లో లో వచ్చాయని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు ..అయినప్పటికీ కమ్యూనిస్టులపట్ల బీఆర్ యస్ వైఖరి ఏ విధంగా ఉన్నదనేది హరీష్ రావు మాటలు అద్దం పట్టాయని అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి..

చాల రోజుల నుంచే కమ్యూనిస్టులకు బలం లేదనే వాదన బీఆర్ యస్ శ్రేణులు వినిపిస్తున్నాయి..వారు పోటీచేస్తే గెలవరని , కావాలంటే ఎమ్మెల్సీలు తీసుకోవాలని పాట పడుతూ వస్తున్నారు . కొందరు వారితో పొత్తు ఉండాలని కోరుకునేవాళ్ళు ఉండగా మరికొందరు వారితో పొత్తు వద్దని బలంగా వాదిస్తున్నారు. వాస్తవంగా కమ్యూనిస్టులకు బలం లేదా అంటే గతంలో ఉన్నంత లేకపోవచ్చు కానీ వారి బలం క్యాడర్ ఉంది . రాష్ట్రంలో 30 నుంచి 40 నియోజకవర్గాల్లో 5 నుంచి 10 ఓట్లకు పైగానే ఉన్నాయి. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం , నల్గొండ జిల్లాలోని 22 నియోజకవర్గాల్లో వారి ప్రభావం కీలకంగా ఉంటుంది. అంటే కాక వరంగల్ , రంగారెడ్డి , ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాల్లో మరో 10 నుంచి 15 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను నిర్ణయించే శక్తిగా ఉన్నారు . బీఆర్ యస్ కమ్యూనిస్టులతో పొత్తు వద్దని అనుకుంటే నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి పొత్తుల విషయమై కేసీఆర్ తేల్చకపోవడం తో బీఆర్ యస్ కమ్యూనిస్టుల మధ్య పొత్తులపై నీలినీడలు అలుముకున్నాయి…. !

Related posts

బండి సంజయ్‌పై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డ రాజేశ్వర్‌రెడ్డి..

Drukpadam

రేషన్ దుకాణం దగ్గర ప్రధాని ఫోటో లేకపోవడంపై కేంద్ర ఆర్ధికమంత్రి ఆగ్రహం !

Drukpadam

ఓట్ల కోసం బీజేపీ చిల్లర రాజకీయాలు … గురుమూర్తి

Drukpadam

Leave a Comment