జనరల్ వార్తలు ...

రాజస్థాన్ లోని గుడి వద్ద న్యాయమూర్తి కుమారుడి రూ 10 వేల షూ చోరీ …!

గుడి వద్ద రూ.10 వేల ఖరీదైన షూస్ చోరీ.. న్యాయమూర్తి పోలీస్ కంప్లైంట్

  • కుటుంబంతో కలిసి జైపూర్‌లోని ఓ దేవాలయానికి వెళ్లిన పోక్సో కోర్టు న్యాయమూర్తి
  • జడ్జి కుమారుడు గుడి మెట్ల వద్ద విడిచి వెళ్లిన బూట్ల చోరీ
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన న్యాయమూర్తి, తక్షణ చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి

గుడి మెట్ల వద్ద విడిచిన ఖరీదైన బూట్లు చోరీ కావడంతో ఓ న్యాయమూర్తి పోలీసులను ఆశ్రయించారు. రాజస్థాన్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. ఆళ్వార్‌కు చెందిన పోక్సో కోర్టు న్యాయమూర్తి జితేంద్ర కుమార్ అగ్రవాల్ ఈ నెల 20న తన కుటుంబంతో కలిసి జైపూర్‌లోని బ్రజ్‌నిధి దేవాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు తన పది వేల రూపాయల రీబాక్ బూట్లను గుడి మెట్ల వద్ద విడిచి లోపలికి వెళ్లాడు. 

ఆ తరువాత బయటకు వచ్చి చూస్తే షూస్ కనిపించలేదు. దీంతో, న్యాయమూర్తి మణక్ చౌక్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ కేసును త్వరగా పరిష్కరించాలంటూ పోలీసులపై ఒత్తిడి పెరిగినట్టు తెలుస్తోంది.

Related posts

బెంగళూరులో ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్

Ram Narayana

చార్‌ధామ్‌ యాత్రపై ఆంక్షలు ఎత్తివేత .. కొనసాగుతున్న సహాయక చర్యలు

Ram Narayana

As tech companies get richer, is it ‘game over’ for startups?

Ram Narayana