Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

ఎవరు అడ్డొచ్చినా విజయవాడ పశ్చిమ నుంచి ఆయనను గెలిపిస్తా: కేశినేని నాని

ఎవరు అడ్డొచ్చినా విజయవాడ పశ్చిమ నుంచి ఆయనను గెలిపిస్తా: కేశినేని నాని
టీడీపీలో కలకలం రేపుతున్న కేశినేని నాని వ్యాఖ్యలు
ఇదే స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న బుద్దా వెంకన్న
గతంలో ఇదే స్థానం నుంచి టికెట్ ఆశించిన నాగుల్ మీరా

విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నుంచి ఎవరు అడ్డొచ్చినా బేగ్ ను ఎమ్మెల్యేగా చేస్తానని వ్యాఖ్యానించారు. కేశినేని నాని వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బుద్దా వెంకన్న పోటీ చేసేందుకు ఆసక్తిని చూపుతున్నారు. ఇప్పటికే ఆయన తన మనసులోని మాటను బయటపెట్టారు. మరోవైపు గతంలో ఇదే నియోజకవర్గం నుంచి నాగుల్ మీరా కూడా కూడా టికెట్ ఆశించారు. ఈ నేపథ్యంలో బేగ్ ను రంగంలోకి దింపి గెలిపించుకుంటానని కేశినేని నాని చెప్పడం టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై పార్టీ హైకమాండ్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Related posts

జగన్ ఆలోచించి నాకే టికెట్ ఇస్తారని ఆశిస్తున్నా: ఎమ్మెల్యే పెండెం దొరబాబు

Ram Narayana

చంద్రబాబు అరెస్ట్ పై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఏమన్నారంటే…!

Ram Narayana

ఏపీలో పెరుగుతున్న పొలిటికల్ హీట్.. ఒకేసారి చంద్రబాబు, జగన్ ప్రచారం ప్రారంభం

Ram Narayana

Leave a Comment