Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

తెలంగాణ ఎన్నికలు.. కేసీ వేణుగోపాల్ తో సీపీఐ నారాయణ భేటీ

కాంగ్రెస్ తో సిపిఐ బేరసారాలు …ఐదు సీట్లు అడిగినట్లు నారాయణ
మునుగోడు , కొత్తగూడెం , వైరా , హుస్నాబాద్ , బెల్లంపల్లి సీట్లు అడిగిన సిపిఐ
రెండు పార్టీలకు చెరొక సీటు ఇస్తామన్న కాంగ్రెస్…
రెండు పార్టీలకు చెరో రెండు సీట్లు ఇచ్చే అవకాశం …
కాంగ్రెస్ చెంతకు రెండు పార్టీలు కొద్దిరోజుల క్రితమే మాణిక్యం ఠాకూర్ తో చర్చలు
కేసి వేణుగోపాల్ తో నారాయణ భేటీ …ఇంకా భేటీ కానీ సిపిఎం నేతలు …

తెలంగాణ రాష్ట్రంలో లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ మధ్య పొత్తుల విషయంపై బేరసారాలు కొనసాగుతున్నాయి. సిపిఐ నేత నారాయణ గత రాత్రి హైద్రాబాద్ వచ్చిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ తో సమావేశం అయ్యారు . ఆ సమావేశంలో రాష్ట్రంలో సిపిఐ కాంగ్రెస్ తో కలిసి పయనించేందుకు తమ అంగీకారాన్ని నారాయణ వేణుగోపాల్ కు తెలిపారు . తమకు కొత్తగూడం , వైరా , మునుగోడు , హుస్నాబాద్ , బెల్లంపల్లి సీట్లు కావాలని నారాయణ తెలిపినట్లు సమాచారం …అయితే కాంగ్రెస్ స్థానిక నాయకులతో చర్చించి తమ వైఖరిని తెలియజేస్తామని కేసి వేణుగోపాల్ చెప్పినట్లు సమాచారం.. వారి మధ్య చర్చలు పక్కన బెడితే కాంగ్రెస్ సిపిఎం , సిపిఐ పార్టీలకు ఒక్కొక్క సీటు ఇస్తామని అన్నట్లు తెలిసింది.. ఎంతవరకు నిజమో తెలియదు కానీ కనీసం చెరో రెండు సీట్లు ఇవ్వాలని సిపిఐ కోరినట్లు తెలుస్తుంది..

సిపిఐ ,సిపిఎం పార్టీలు కాంగ్రెస్ తో బేరసారాలకు సిద్ధపడ్డ నేపథ్యంలో పొత్తులకు ఒకే అంటున్న కాంగ్రెస్, లెఫ్ట్ వైఖరిని తప్పు పడుతుంది . మొదట బీఆర్ యస్ తో వెళతామని చెప్పిన పార్టీలు కేసీఆర్ వారిని పక్కన పెట్టిన తర్వాతనే తమతో జతకట్టెదుకు సిద్దపడుతున్నాయని అంటున్నారు . రాజకీయాల్లో ఒక పార్టీ కాకపోతే మరో పార్టీతో పొత్తులు సహజంగా జరుగుతాయి.. కానీ సిపిఎం , సిపిఐ లాంటి సిద్ధాంత నిబద్దత కలిగిన పార్టీలు… వారు కాకపోతే వీరు, వీరు కాకపోతే వారు అనే వైఖరితో పొత్తులకు వెళ్లడంపై రాజకీయ పరిశీలకులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు . వారి వైఖరిని తప్పు పడుతున్నారు …బీఆర్ యస్ తో కలిసి ఎన్నికల్లో పోటీచేస్తామని చెప్పిన విషయాన్నీ నిజాయతీగా అంగీకరించి ముందుకు వెళ్లే క్రమంలో భేషిజాలకు పోతున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి..ఇప్పటికైనా బీఆర్ యస్ వైఖరిని తెలుసుకొని బయటకు రావడాన్ని ఆహ్వానిస్తున్నాయి…

అంతకు ముందు సిపిఐ , సిపిఎం పార్టీలు బీఆర్ యస్ తో కలిసి వెళ్లాలని అనుకున్నాయి. ఆ విషయాన్నీ అనేక సందర్భాల్లో వెల్లడించాయి. కేసీఆర్ కూడా తమకు ఆ మేరకు హామీ ఇచ్చినట్లు లెఫ్ట్ నేతలు చెప్పారు …వారి మధ్య అనేక సార్లు చర్చలు జరుగుతాయని అనుకున్న, కేసీఆర్ కనీసం వారికీ అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు …చివరకు వారిని ఏమాత్రం సంప్రదించకుండానే ఏకపక్షంగా తమ పార్టీ తరుపున పోటీచేసే అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు …దీంతో లెఫ్ట్ పార్టీలు కేసీఆర్ వైఖరిపై మండిపడుతున్నాయి . బీజేపీ వ్యతిరేక పోరాటం చేస్తానన్న కేసీఆర్ మునుగోడు ఉపఎన్నికల్లో తమ మద్దతు తీసుకోని గెలిచి , బీజేపీ తో రహస్య సంబంధాలు కలిగి ఉన్నాడని ఆరోపిస్తున్నాయి…అందువల్లనే తమను ఇండియా కూటమిలో ఉన్నారనే నెపంతో కలిసి నడిచేందుకు విముఖత వ్యక్తం చేశారని దుయ్యబడుతున్నారు . తాము ఇండియా కూటమిలో ఉన్నామన్న సంగతి తెలిసి వారితో చర్చలు జరిపేందుకు ఆయన దూతలను ఎందుకు పంపినట్లు అని ప్రశ్నిస్తున్నాయి. చెరొక సీటు ఇస్తామని ప్రతిపాదనలు ఎందుకు పెట్టారో చెప్పాలని నిగ్గదీస్తున్నాయి.

ఈ ఏడాది చివర్లోగా తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవలి కాలంలో కమ్యూనిస్టులతో స్నేహం చేసిన కేసీఆర్… ఇప్పుడు వాళ్లను దూరం పెట్టారు. కమ్యూనిస్టులకు కేసీఆర్ ఒక్క సీటును కూడా కేటాయించలేదు. దీంతో కాంగ్రెస్ వైపు కమ్యూనిస్టులు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో సీపీఐ నారాయణ భేటీ అయ్యారు.

 ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ చర్చలు సఫలమయినట్టు చెప్పారు. ఒకటి, రెండు రోజుల్లో సీపీఎం జాతీయ నేతలతో కాంగ్రెస్ నేతలు చర్చలు చేయనున్నారు. ఇంకోవైపు సీపీఐ, సీపీఎం పార్టీలకు గెలవగలిగిన స్థానాల్లో చెరొక సీటు కేటాయించే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు సమాచారం. అయితే కమ్యూనిస్టులు చెరో మూడు సీట్లను కోరుతున్నట్టు తెలుస్తోంది. చివరకు చెరో రెండు సీట్లు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.

ఆ ఐదు సీట్లు మాకు కేటాయించండి: కాంగ్రెస్‌ ను కోరిన సీపీఐ

  • తాము పోటీ చేయాలనుకునే స్థానాల జాబితాను కాంగ్రెస్‌కు అందించిన సీపీఐ
  • కొత్తగూడెం, వైరా, మునుగోడు, బెల్లంపల్లి, హుస్నాబాద్ కోరుతున్న కమ్యూనిస్ట్ పార్టీ
  • ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ నో!
CPI interest to contest in five seats

రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు సీట్లలో పోటీ చేయాలని సీపీఐ భావిస్తోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆ పార్టీ ప్రతినిధులు బుధవారం కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిసి తాము పోటీ చేయాలనుకుంటున్న స్థానాలతో కూడిన జాబితాను అందించారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, వైరా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో మునుగోడు, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా నుంచి బెల్లంపల్లి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి హుస్నాబాద్ నియోజకవర్గాలను తమకు కేటాయించాలని సీపీఐ నేతలు… కాంగ్రెస్ పార్టీని కోరారు.

అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు స్థానాలు ఇవ్వలేమని కాంగ్రెస్ పార్టీ చెప్పగా, కొత్తగూడెం కేటాయించాలని కోరినట్లుగా తెలుస్తోంది. అలాగే హుస్నాబాద్‌పై కాంగ్రెస్ నో చెబుతుండగా, సీపీఐ పట్టుబడుతోంది. రెండు రోజుల్లో సీట్ల పంపిణీని తేల్చాలని సీపీఐ కోరుతోంది.

Related posts

తెలంగాణ ప్రగతిభవన్ ఇకనుంచి జ్యోతిరావు పూలె ప్రజాభవన్…

Ram Narayana

ప్రజల తెలంగాణ… దొరల తెలంగాణ మధ్య ఈ ఎన్నికలు: రాహుల్ గాంధీ

Ram Narayana

మూడవసారి దీవించండి …మరింత అభివృద్ధి చేసే అవకాశం కల్పించండి ..మంత్రి అజయ్ …!

Ram Narayana

Leave a Comment