Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

గంట సేపు కోదండ‌రాం మౌన‌దీక్ష…..

గంట సేపు కోదండ‌రాం మౌన‌దీక్ష..
తెలంగాణ కేబినెట్ నేడు మంచి నిర్ణ‌యం తీసుకోవాల‌ని డిమాండ్
క‌రోనా వ‌ల్ల సామాన్య ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు
ప్ర‌జ‌ల‌కు వైద్యం ఒక హ‌క్కుగా ప్ర‌భుత్వం క‌ల్పించాలి
ర్యాపిడ్ టెస్ట్ కిట్ల‌ను ప్ర‌జ‌లంద‌రికీ అందుబాటులో ఉంచాలి
గ్రామాల్లో ఐసోలేష‌న్ కేంద్రాల‌ను ఏర్పాటు చేయాలి

తెలంగాణలో క‌రోనా సంక్షోభ ప‌రిస్థితుల స‌మ‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌వ‌ర్తిస్తోన్న తీరును నిర‌సిస్తూ టీజేఎస్ అధ్య‌క్షుడు కోదండ‌రాం పార్టీ కార్యాలయంలో ఈ రోజు ఉద‌యం 8 గంట‌ల నుంచి 9 గంట‌ల వ‌ర‌కు మౌన‌దీక్ష‌కు దిగారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ… నేడు కేబినెట్ భేటీలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. క‌రోనా వ‌ల్ల సామాన్య ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని ఆయ‌న చెప్పారు.

ప్ర‌జ‌ల‌కు వైద్యం ఒక హ‌క్కుగా ప్ర‌భుత్వం క‌ల్పించాల‌ని ఆయ‌న అన్నారు. ర్యాపిడ్ టెస్ట్ కిట్ల‌ను ప్ర‌జ‌లంద‌రికీ అందుబాటులో ఉంచాల‌ని డిమాండ్ చేశారు. గ్రామాల్లో ఐసోలేష‌న్ కేంద్రాల‌ను ఏర్పాటు చేయాల‌ని చెప్పారు. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా అంద‌రికీ వ్యాక్సిన్లు వేయాల‌ని ఆయ‌న అన్నారు. కొవిడ్ నియంత్రణకు స‌మ‌ర్థంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అన్నారు. కాగా, కోదండరాంకు మద్దతుగా ఆయ‌న అనుచ‌రులు, అభిమానులు వారి ఇళ్లలోనే మౌన దీక్ష కొనసాగించారు.

Related posts

తెలంగాణ‌లో త్వ‌ర‌లోనే ప్ర‌భుత్వం మార‌బోతోంది: అమిత్ షా సంచలన వ్యాఖ్యలు!

Drukpadam

వైసీపీని తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి: బాలకృష్ణ

Drukpadam

కేజ్రీవాల్ పార్టీ నుండి కాంగ్రెస్‌కు ఊహించని ఆఫర్!

Drukpadam

Leave a Comment