Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ విధ్వంసానికి గురైంది …మంత్రి కోమటి రెడ్డి

తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తాము ముందుకు సాగుతున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి ఖమ్మం కలెక్టరేట్‌లో కోమటిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ విధ్వంసానికి గురైందని, తాము గాడిన పెడుతున్నామన్నారు. ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ నాయకులు కోట్లాది రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేశానని చెప్పుకున్న కేసీఆర్ కనీసం ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదన్నారు. కనీసం కాలువలు తవ్వలేదన్నారు. మేడిగడ్డ కుంగిపోవటం తెలంగాణకే తలవంపులు అని దుయ్యబట్టారు. మేడిగడ్డ కుంగుబాటు వెనుక విధ్వంసక చర్య ఉందని కల్లబొల్లి కబుర్లు చెప్పారని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ది చేయాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ముందుకు సాగుతోందన్నారు. పేదవాడి ఆత్మగౌరవం నిలబెడతామని, నిజాయతీతో కూడిన పాలన ప్రజలకు అందిస్తామన్నారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట కఠినంగా ఉంటుందని, కానీ పనిమంతుడని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లాలో మంత్రులు కోమటిరెడ్డి, తుమ్మల, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. మీడియా సమావేశంలో తుమ్మల మాట్లాడుతూ… ఆర్ అండ్ బి కోమటిరెడ్డి వద్ద ఉందని, కాబట్టి తమ జిల్లాలో రహదారుల అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఖమ్మం జిల్లాలో చాలావరకు జాతీయరహదారులు అయినప్పటికీ నాగపూర్ -అమరావతి జాతీయ రహదారికి ఉన్న సమస్యలు పరిష్కరించాలని అన్నారు ..ఖమ్మం- సూర్యాపేట,కోదాడ- కురవి , కొత్తగూడెం నుంచి వెలిగొండ రోడ్డును కూడా పూర్తి చేయాలన్నారు. ఇవి పూర్తీ అయితే ఖమ్మం జిల్లాలో ఒక్క సెంటీమీటర్ కూడా జాతీయ రహదారి కవర్ కాకుండా ఉండదని అన్నారు ..ఇరిగేషన్ విషయంలో సీతారామ ప్రాజెక్ట్ పూర్తీ అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు ,నాగార్జునసాగర్ కు కనెక్ట్ అవుతుందని తెలిపారు …అందరం కలిసికట్టుగా ఆరు గ్యారంటీలను అమలు చేయాలనీ అన్నారు …కమ్యూనికేషన్ , నీటి పారుదల ప్రాజెక్ట్ లు పూర్తీ అయితే ఖమ్మం జిల్లా ప్రగతిలో నెంబర్ వన్ గా నిలుస్తుందని తుమ్మల ఆశాభావం వ్యక్తం చేశారు ..

గత కొంతకాలంగా తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి ఆగిపోయాయని వ్యాఖ్యానించారు. ఇప్పుడు రాష్ట్రాన్ని, జిల్లాను మళ్లీ అభివృద్ధి బాట పట్టిస్తామన్నారు. అందరి సహకారంతో కాంగ్రెస్ పార్టీకి అవకాశం వచ్చిందని, తాము గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.  పేద, బడుగు, బలహీనవర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు సాగుతానన్నారు.

కేసీఆర్ పాలన అంతా మోసం దగా అందుకే ప్రజలు దాన్ని తిరస్కరించారని మీడియా సమావేశంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధ్వజమెత్తారు …కాంగ్రెస్ నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యం కావాలని తెచ్చుకున్నారు …ఇందిరమ్మ రాజ్యం అంటే ఏమిటని కేసీఆర్ వివిధ సభల్లో ఎగతాళి చేశారు …ఇప్పుడు అది ఏమిటో చూపించాలి …పేదలకు సంక్షేమ పథకాలు అందలి …ఎన్నికల్లో వాగ్దానం చేసిన ఆరు గ్యారంటీలను అమలుకు ,ప్రజాపాలన చేపట్టాం …ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు వివిధ గ్రామాల్లో సభలు పెట్టి లబ్దిదారులనుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు …

సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఒక సందర్భంలో విద్యుత్ గురించి మాట్లాడితే తప్పుడు అర్దాలు తీసి కేసీఆర్ ప్రతి సభలో చెప్పారు … 24 గంటల విద్యుత్ సరఫరా పై మంత్రి కోమటి రెడ్డి కూడా ఛాలంజ్ చేశారని లాగ్ బుక్ లు లేకుండా చేశారని కేసీఆర్ పాలన డొల్లతనంపై పొంగులేటి నిప్పులు చెరిగారు … అయినా ఆయన మాటలు ఎవరు నమ్మలేదని అందుకే కాంగ్రెస్ కు ప్రజలు పట్టం కట్టారని అన్నారు …

Related posts

హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన రేణుకా చౌదరి

Ram Narayana

రేవంత్ రెడ్డీ ఇక్కడ భయపడేవాళ్లు లేరు… వెంట్రుక కూడా పీకలేవ్: కేటీఆర్ తీవ్ర ఆగ్రహం

Ram Narayana

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే ఫ్లెక్సీ వార్!

Ram Narayana

Leave a Comment