- మోదీని కలిసిన వారిలో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్
- మోదీతో కాసేపు ముచ్చటించిన ప్రజాప్రతినిధులు
- రాజాసింగ్ భుజం తట్టిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్రమోదీని తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిశారు. వారితో పాటు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా ఉన్నారు. వారు ప్రధాని మోదీకి శాలువా కప్పి సత్కరించారు. ఎంపీలను, ఎమ్మెల్యేలను ప్రధాని ఆప్యాయంగా పలకరించారు. వారితో వివిధ అంశాలపై మాట్లాడారు.
ప్రధానిని కలిసిన వారిలో ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ధర్మపురి అర్వింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, గోడం నగేశ్, ఎమ్మెల్యేలు రాజాసింగ్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి తదితరులు ఉన్నారు. మోదీ ఈ సందర్భంగా రాజాసింగ్‌ను తన దగ్గరకు పిలిచి భుజం తట్టారు.