ఇండియాలో అంబరాన్ని అంటిన నూతన సంవత్సర వేడుకలు …
దేశ రాజధాని ఢిల్లీతో సహా ముంబై ,కోల్ కత్తా ,హైద్రాబాద్ ,బెంగుళూరు చైన్నై లలో సంబురాలు
నిషేదాజ్ఞలు నడుమ హోరెత్తించిన యువత
2024 నూతన సంవత్సర వేడుకలు ఇండియాలో ఘనంగా జరుపుకున్నారు… కచ్చితంగా రాత్రి 12 గంటలకు 2023 వ సంవత్సరానికి వీడ్కోలు కలుపుతూ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ యువత ఆనందంతో చిందులు వేశారు….పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు …ఒకరికొకరు శభాకాంక్షలు తెలుపుకున్నారు …. దేశ రాజధాని ఢిల్లీ తో సహా నగరాల్లో సంబరాలు ఘనంగా జరిగాయి…. ప్రధానంగా ముంబై, హైదరాబాద్, బెంగళూర్ ,చెన్నై తదితర నగరాల్లో యువత కేరింతలు కొట్టారు … వేడుకల్లో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఆనంద డోలికల్లో మునిగారు … అన్ని నగరాల్లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీస్ లు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు … ముందుగానే నిషేధాజ్ఞలు విధించి ప్రజలను అప్రమత్తం చేశారు … పబ్బులు , క్లబ్బులు ,రెస్టారెంట్లు , రాత్రి ఒంటిగంట వరకు తెరిచి ఉంచారు… కొన్ని ప్రాంతాలలో రోడ్లను మూసివేశారు…. ప్రధానంగా ఫ్లైఓవర్ తీగల బ్రిడ్జిలు మూసివేశారు … హైదరాబాదులోని దుర్గం చెరువు వద్ద తీగల బ్రిడ్జి , నెక్లెస్ రోడ్ మరికొన్ని ఫ్లైఓవర్ పై వాహనాల రాకపోకలను నిషేధించారు …అవుటర్ రింగ్ రోడ్ పై వాహనాలు తిరగనివ్వలేదు… డ్రంకెన్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టారు ఎట్టి పరిస్థితిలోనూ తాగి వాహనాలు నడపవద్దని హెచ్చరికలు జారీచేశారు …తాగి వాహనాలు నడిపిన వారికి జరిమానాలు విధించారు… ఈ సందర్భంగా వందల కేసులు నమోదైనట్లు పోలీసు అధికారులు తెలిపారు …. ఇందులో ప్రముఖ వ్యక్తులు కూడా ఉన్నట్లు సమాచారం… దేశంలోని వివిధ ప్రాంతాల్లో కూడా ఉత్సవాలు ఘనంగా జరిగాయి … పల్లెల నుంచి పట్టణాల వరకు అన్ని ప్రాంతాల్లో యువతను కేరింతలు కొట్టారు …. కచ్చితంగా 12 గంటలకు రోడ్లపై వాహనాలతో షికార్లు చేశారు …. ఉత్సాహం పూరిత వాతావరణంలో 2024 సంవత్సరా నికి స్వాగతం పలికారు… వివిధ గృహాల ముందు 2023 కు వీడ్కోలు పలుకుతూ 2024 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ గృహిణులు పొగిపడి వేసిన ముగ్గులు చూపరులను ఆకర్షించాయి…..