Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

పులివెందులలో జగన్ ఓటమే ధ్యేయంగా బ్రదర్ అనిల్ పావులు…!

పులివెందులలో సీఎం జగన్ ఓటమి ధ్యేయంగా బ్రదర్ అనిల్ పావులు కదుపుతున్నారు …ఈమేరకు బుధవారం కడప ఎయిర్ పోర్టులో టీడీపీ నేత ఎమ్మెల్సీ బీటెక్ రవితో బ్రదర్ అనిల్ చర్చలు జరిపారు … పులివెందుల నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేయబోతున్న బీటెక్ రవిని జగన్మోహన్ రెడ్డి చెల్లెలి భర్త బ్రదర్ అనిల్ కుమార్ కడప విమానాశ్రయంలో కలిసి దాదాపు అరగంటకు పైగా మాట్లాడటం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది …. ఈ భేటీలో వారు ప్రధానంగా పులివెందుల రాజకీయాలు కడప రాజకీయాలు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీ పగ్గాలు చేపడితే ఎలా ఉంటుందని దానిపై రవి అభిప్రాయాలు బ్రదర్ అనిల్ కుమార్ తెలుసుకున్నట్లు సమాచారం… ప్రధానంగా కడపలో వైసిపిని డ్యామేజ్ చేయాలని ఉద్దేశంతో ఉన్న బీటెక్ రవి కి బ్రదర్ అనిల్ కుమార్ తోడు కావడం చర్చనీయాంశంగా మారింది … దీంతో కడపలో జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టాలని వారు పథకం రచిస్తున్నారనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి… శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్లు ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి … ఇప్పటికే తెలుగుదేశం జనసేన కూటమిగా ఏర్పడి వైసిపి నీ అధికారంలోకి రాకుండా చేయాలని పావులు కడుపుతుండగా , ఇప్పటివరకు తెలంగాణ రాజకీయాల్లో ఉన్న జగన్ చెల్లెలు షర్మిల హఠాత్తుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రవేశించబోతున్నారు… జగన్మోహన్ రెడ్డి బుధవారం తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న రాజకీయాలపై దాడి చేశారు… ప్రధానంగా ఆ పార్టీ అధికారం కోసం ఎంతటి దారుణానికైనా తెగబడేందుకు ప్రతిపక్ష పార్టీలు సిద్ధంగా ఉన్నాయని, కుటుంబాలను చీల్చడం , తప్పుడు ప్రచారం చేయటం వారి విదంగా పెట్టుకున్నారని ప్రజలు గ్రహించి అప్రమత్తంగా ఉండి దుష్టశక్తులను ఓడించాలని పిలుపునిచ్చారు…

కడప పరిస్థితి ఏంది?: పులివెందుల టీడీపీ నేత బీటెక్ రవితో వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్

Brother Anil and Btech Ravi

ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యతలను వైఎస్ షర్మిల చేపట్టబోతున్నారనే పరిణామాల నేపథ్యంలో రాజకీయ వేడి పెరుగుతోంది. క్రిస్మస్ సందర్భంగా టీడీపీ యువనేత లోకేశ్ కు సీఎం జగన్ సోదరి, వైఎస్ షర్మిల గిఫ్ట్ పంపించడం ఏపీ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారి తీసింది. ఈరోజు జరిగిన మరో పరిణామం ఉత్కంఠను మరింత పెంచుతోంది. జగన్ గడ్డ పులివెందుల టీడీపీ ఇన్ఛార్జీ బీటెక్ రవి, షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ కడప ఎయిర్ పోర్టులో ముచ్చటించుకోవడం ఆసక్తికరంగా మారింది. కడప ఎయిర్ పోర్టులో వీరిద్దరూ మాట్లాడుకుంటుండగా తీసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. 

ఇద్దరూ కూడా పలు అంశాలపై చర్చించుకున్నట్టు తెలుస్తోంది. ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా షర్మిల వస్తే ఎలా ఉంటుందని రవిని అనిల్ అడిగారు. దీనికి సమాధానంగా అన్ని విధాలుగా బాగుంటుందని రవి చెప్పారు. కడప జిల్లాలో రాజకీయం ఎలా ఉందని కూడా రవిని అనిల్ అడిగినట్టు సమాచారం. దాదాపు అరగంటకు పైగా బీటెక్ రవితో బ్రదర్ అనిల్ సంభాషించారు.

Related posts

ఏపీలో మరికొందరు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్…

Ram Narayana

జగన్‌ను గెలిపించకుంటే పథకాలు రావనే భయంవద్దు!: పవన్ కల్యాణ్

Ram Narayana

ముఖ్యమంత్రి గారూ… మీ ఇద్దరూ ఇక బ్యాండేజీలు తీసేయండి: వర్ల రామయ్య…

Ram Narayana

Leave a Comment