ఆరోగ్యంతెలంగాణ వార్తలు

విషమంగా తమ్మినేని ఆరోగ్యం …తాజా హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఎఐజీ ఆసుపత్రి

సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితిపై ఏఐజీ వైద్యులు కొద్దీ సేపటి క్రితం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం తమ్మినేని ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వెల్లడించారు. వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నామని తెలిపారు. తమ్మినేని గుండె, కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు బులెటిన్ లో పేర్కొన్నారు. ఊపిరి తిత్తుల నుండి నీరు బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నామని వైద్యులు తెలిపారు.
కాగా, ఇవాళ తమ్మినేని ఖమ్మం జిల్లాలోని తన సొంత నివాసంలో గుండె పోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం.. మెరుగైన ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతంఎఐజీ ఆసుపత్రిలో తమ్మినేని వీరభద్రానికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

తమ్మినేని సోమవారం స్వల్ప అస్వస్థతతో ఖమ్మంలోని ఒక ప్రవేట్ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఖమ్మం పక్కనే ఉన్న తన స్వగ్రామమైన తెల్దారుపల్లి ఉండగా కొంత ఆన్ ఈజీగా అనిపించింది . రెండు రోజులుగా ఖమ్మం జిల్లాలో వరుసగా పర్యటనలలో విరామం లేకుండా తిరిగారు .పార్టీ సమావేశాల్లో పాల్గొంటూనే పలువురి ఇళ్లకు వెళ్లి పరామర్శలు చేశారు .. సోమవారం ఉదయం తనకు నలతగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పారు . అదే రోజు సాయంత్రం మరింత నీరసంగా ఉండటంతో గమనించిన కుటుంబసభ్యులు ఖమ్మంలోని ప్రవేట్ హాస్పటల్ కు చికిత్స నిమిత్తం తీసుకోని వెళ్లారు … ఆయన్ను పరీక్షించిన వైద్యులు బ్రీతింగ్ ప్రాబ్లెమ్ ఉందని ,గతంలోలాగే గుండెకు నీరు వచ్చిందని తెలిపారు …అందువల్ల పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు …ఎందుకైనా మంచిదని మెరుగైన వైద్యం కోసం హైద్రాబాద్ వెళ్లాలని సూచించారు …

దీంతో ఖమ్మం డాక్టర్ల సలహా మేరకు హుటాహుటిన ప్రత్యేక ఎస్కార్ట్ తో అంబులెన్స్ లో ఖమ్మం నుంచి హైద్రాబాద్ తరలించారు … హైదరాబాదులోని గచ్చిబౌలి ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఐ సి యు లో ఉన్నారు. వివిధ రకాల పరీక్షలు చేశారు. ప్రముఖ వైద్యులు సోమరాజు , డి ఎన్ కుమార్ నేతృత్వంలో డాక్టర్ల బృందం ఆయన్ను పర్యవేక్షిస్తున్నారు… పార్టీ కార్యకర్తలు, అభిమానులు ,శ్రేయోభిలాషులు ఎవరు ఆసుపత్రికి రావద్దని డాక్టర్లు విజ్ఞప్తి చేశారు .

2004 లో తమ్మినేని మొదటిసారిగా గుండెపోటు వచ్చింది … అప్పడు మొదట ఖమ్మంలోని క్యూర్ హాస్పటల్ కు తరలించి అక్కడ నుంచి హైద్రాబాద్ లోని కేర్ హాస్పటల్ లో చేర్పించారు . డాక్టర్లు ఆయనకు వాల్స్ పుడకపోవడంతో గుండెకు స్టెంట్లు వేశారు … ఆతర్వాత ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు … నాటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గానే పాల్గొంటున్నారు … సుదీర్ఘ సైకిల్ యాత్ర , పాదయాత్ర లు చేసి రాష్ట్రమంతా తిరిగారు …మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీచేశారు …

Related posts

‘మ్యాజిక్ వాటర్’… భాగ్యశ్రీ చెప్పిన హెల్త్ టిప్ ఇదిగో!

Ram Narayana

తెలంగాణ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు

Ram Narayana

కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మీద కేసు నమోదు…

Ram Narayana