- ధరణికి సంబంధించి తమ వద్ద సమాచారం ఉందని వెల్లడి
- రిజిస్ట్రేషన్ శాఖను ప్రక్షాళన చేస్తామన్న మంత్రి
- వేసవిలో తాగునీటి సమస్య లేకుండా చూస్తామని హామీ
ధరణిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం తెలిపారు. ధరణికి సంబంధించి తన వద్ద మరింత సమాచారం ఉందన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ… రిజిస్ట్రేషన్ శాఖను ప్రక్షాళన చేస్తామన్నారు. వేసవి కాలంలో ప్రజలకు ఎలాంటి తాగునీటి సమస్యలు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరి ఫోన్లను ట్యాపింగ్ చేయడం లేదని స్పష్టం చేశారు.
పంట నష్టపోయిన రైతును ఆదుకుంటాం: జూపల్లి
నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. వడగళ్ల వర్షానికి నష్టపోయిన ప్రతి రైతును కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలంలోని పలు మండలాల్లో ఆయన పర్యటించారు. వడగళ్ల వాన కారణంగా నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఆదుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు.