Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆఫ్ బీట్ వార్తలు

రెండే చేపలు.. కానీ ధర రూ.4 లక్షలు…

  • అంతర్వేది తీరంలో మత్స్యకారులకు చిక్కిన కచ్చిడీ చేపలు
  • శనివారం వేలంలో భారీ మొత్తం పలికిన వైనం
  • ఔషధ తయారీలో ఉపయోగిస్తారని చెబుతున్న మత్స్యకారులు

వలలో చిక్కినవి రెండే చేపలు.. అయితేనేం భారీ మొత్తాన్ని ఆర్జించిపెట్టాయి. ఒక్కోటీ ఏకంగా రూ.2 లక్షల ధర పలికాయి. దీంతో ఆ మత్స్యకారుల పంటపడింది. కృష్ణా జిల్లాకు చెందిన  మత్స్యకారులకు అంతర్వేది సముద్ర తీరంలో శనివారం 2 కచ్చిడీ చేపలు చిక్కాయి. అరుదైన ఈ చేపలను కోనసీమ జిల్లా అంతర్వేదిపల్లి పాలెం మినీ ఫిషింగ్‌ హార్బర్‌లో వేలం వేశారు. ఈ రెండు చేపలను ఓ వ్యాపారి రూ.4 లక్షలకు కొనుగోలు చేశారు. ఈ చేపల్లో ఉండే తెల్లటి బ్లాడర్‌ ను ఔషధాల తయారీలో, శస్త్రచికిత్సలో కుట్లు వేసే దారం తయారీలో వాడతారని మత్స్యకారులు చెప్పారు. ఈ చేపలు అరుదైనవి కావడం, మందుల తయారీకి ఉపయోగపడడం వల్లే వీటికి ధర బాగా పలుకుతుందని పేర్కొన్నారు.

Related posts

వామ్మో… ఎంత పెద్ద ట్యాంకరో!

Ram Narayana

25 ఏళ్ల క్రితం బంధువుల పెళ్లికి వెళ్లి తప్పిపోయిన మహిళ.. అంత్యక్రియలూ చేసేశారు.. కానీ బిగ్ ట్విస్ట్

Ram Narayana

రైలు ప్రయాణికులకు ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట!

Ram Narayana

Leave a Comment