Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

ఖమ్మంలో కలిసిన మంత్రులు …కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం సమిష్టి వ్యూహం దిశగా అడుగులు…

ఎట్టకేలకు ఖమ్మంలో జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క , మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలిశారు …కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన అభ్యర్థి సమావేశాల్లో , నామినేషన్ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల , పొంగులేటి పాల్గొన్నప్పటికీ డిప్యూటీ సీఎం రాలేదు …అయితే ఆయనకు పార్టీ హైకమాండ్ ఒడిశా ఎన్నికల భాద్యతలు ఇచ్చినందున రాలేక పోయారని ఆయన అనుయాయులు చెప్పారు… ఖమ్మం ఎంపీ టికెట్ కోసం చివరివరకు ప్రయత్నం చేసిన ముగ్గురు మంత్రుల మధ్య గ్యాప్ ఏర్పడిందనే ప్రచారం జరిగింది…చివరకు మంత్రి పొంగులేటి వియ్యంకుడు రామసహాయం రఘురాం రెడ్డికి అధిష్టానం టికెట్ కేటాయించడంతో ఖమ్మం జిల్లాలు చెందిన మంత్రుల్లో అభిప్రాయభేదాలు ఉన్నాయని ,వారు రచ్చకెక్కే అవకాశాలు ఉన్నాయని ప్రత్యర్థి పార్టీలు ఆశగా ఎదురు చూశాయి…అందుకు భిన్నంగా సోమవారం మంత్రులందరూ ఖమ్మంలో డిప్యూటీ సీఎం నివాసంలో సమావేశమై అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలనీ తీర్మానించుకున్నారు …తమపై జరుగుతున్న ప్రచారం ఉత్తిదే అని సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేశారు .. ఎన్నికల ప్రచారం పని విభజనపై చర్చించారు …కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం నియోజకవర్గాలవారీగా పర్యటనలపై సమీక్షించారు …అనంతరం తుమ్మల , పొంగులేటిలతో కలిసి మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కంచుకోట …పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు …

సమావేశంలో ఎన్నికల ఏర్పాట్లపై సమాలోచనలు చేయడం జరిగిందన్నారు . ప్రచార కార్యక్రమాలకు సంబంధించి ఒక కార్యాచరణ ప్రణాలికను ఏర్పాటు చేసుకోవడంపై చర్చించడం జరిగిందని భట్టి తెలిపారు . లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రచార సమన్వయ కమిటీ ప్రకటిస్తామన్నారు …జిల్లాస్థాయి, నియోజక వర్గ స్థాయి సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతామని పేర్కొన్నారు …

ఈ దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ప్రజలను, దేశ ఆస్తులను కాపాడేందుకు రాహూల్ గాంధీ ప్రయత్నిస్తున్నారు.దేశంలో సంపద, వనరులను ప్రజలకు పంచాలని రాహుల్ గాంధీ లక్ష్యంమన్నారు …క్రోని కాపీటలిస్టులైన కొందరు మిత్రులు కోసం, అంబానీ, అదానిలకు సహజ వనరులను, సంపదను పంచి పెడుతున్నారని విమర్శించారు … ఈ రాష్ట్రాన్ని లూటీ చేసిన బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఎన్నికల్లో ఇంటికి పంపిన విషయాన్నీ గుర్తు చేశారు …

రాష్ట్రం లో శ్రీనివాస్ గౌడ్, జగదీశ్వర రెడ్డి ఇంట్లో కూర్చొని కరెంట్ పోయింది అని కేసీఆర్ అబ్దద్దాలు ప్రచారం చేస్తున్నారు…పదేళ్లుగా రాష్ట్రాన్ని దోచేసి సిగ్గు లేకుండా ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని రాష్ట్రం తిరుగుతున్నారని ప్రశ్నించారు .ఖమ్మం జిల్లా అంటేనే కాంగ్రెస్ పార్టీ కంచు కోట. ఈ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రఘురామి రెడ్డిని పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో ప్రజలు గెలిపిస్తారని కోరుతున్నారు …

అంతకు ముందు మంత్రులతోపాటు అభ్యర్థి రఘురామి రెడ్డి, ఎమ్మెల్యేలు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు , సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి ,వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ , అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ , డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, నగర అధ్యక్షులు మహమ్మద్ జావేద్ లు పాల్గొన్నారు…

Related posts

ప్రజాస్వామ్య పరిరక్షణలో కలాలు, గళాలుఐజెయు నేత రాంనారాయణ

Ram Narayana

ఐక్యంగా పని చేద్దాం..పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధిద్దాం …ఎంపీ నామ

Ram Narayana

బడులు తెరిచినరోజునే పిల్లలకు పుస్తకాలూ ,దుస్తులు పంపిణి చేసిన డిప్యూటీ సీఎం భట్టి ,మంత్రి తుమ్మల …

Ram Narayana

Leave a Comment