ప్రాణాలు తీసిన ఈత సరదా… తండ్రి ఎదుటే ముగ్గురు విద్యార్థులు మృతి
లబోదిబోమంటున్న రెండు కుటుంబాలు ..
సిపిఐ నేతల పరామర్శ
వేసవి కాలం మిట్టమధ్యాహం ఆటవిడుపుగా ఒక ఆటో డ్రైవర్ చేపలు పడదామని పక్కనే ఉన్న మున్నేటికి తన ఆటోతో బయలు దేరాడు …సెలవులు కావడంతో ఇంట్లోనే ఉన్న తన ఇద్దరు కొడుకులు , అతని స్నేహితుడి కలిసి ఆటోలో చేపల వేటకు వెళ్లారు …తండ్రి చేపలు పడుతుండగా పిల్లలు ముగ్గురు మునేరులో సరదాగా ఈతకొడుతున్నారు …ఇంతలో మున్నేరుపై నేషనల్ హైవే బ్రిడ్జి కోసం మున్నేరు లో తీసిన పిల్లర్ల గుంతల్లోకి వెళ్లారు ..అందులోనుంచి బయటకు రాలేక ఊపిరాడక చనిపోయారు …వివరాల్లోకి వెళ్ళితే ఏన్కూర్ మండలం జెన్నారం గ్రామానికి చెందిన ఆముదాల చిరంజీవి ,లక్ష్మి దంపతులు బ్రతుకు దెరువుకోసం ఖమ్మం వచ్చారు …వారికీ లోకేష్ , హరీష్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు ..వీరితో పాటు పక్క ఇంట్లో ఉంటున్న గణేష్ కూడా వారితో కలిసి వెళ్లారు …చిరంజీవి ఇద్దరు కుమారులు వయసు 14 ,12 సంవత్సరాలు కాగా , పక్కింటి పిల్లాడి వయసు 14 సంవత్సరాలు ఆటను తనికెళ్ళ వద్ద గల గురుకులంలో చదువుతున్నాడు ….ఈ వార్త తెలిసిన వెంటనే చుట్టుపక్కలవారు బంధువులు , వివిధ పార్టీల నాయకులూ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు …ఆ పిల్లల తల్లిదండ్రులను ఓదార్చే ప్రయత్నం చేశారు …రురల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు …
10 లక్షల ఎక్సగ్రేషయో ఇవ్వాలని సిపిఐ డిమాండ్ ….
భాదిత కుటుంబాలకు ఒక్కరికి 10 లక్షల రూపాయల ఎక్సగ్రేషయో ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర నాయకులు భాగం హేమంతరావు డిమాండ్ చేశారు …కుటుంబసభ్యులను వారి తల్లిదండ్రులను ఆయన పరామర్శించి ఓదార్చారు …ఇది నేషనల్ హైవే తప్పిదానమేనని అందువల్ల భాదిత కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందేనని అన్నారు ..