Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌… 8 మంది నక్సలైట్లు, ఒక జవాన్‌ మృతి!

  • నారాయ‌ణ‌పుర్‌లోని అబుజ్‌మాడ్ అడ‌వుల్లో ఇవాళ ఉద‌యం ఎన్‌కౌంట‌ర్
  • నారాయ‌ణ‌పుర్, కంకేర్, దంతేవాడ జిల్లాల‌కు చెందిన భ‌ద్ర‌తా ద‌ళాల యాంటీ న‌క్స‌ల్ ఆప‌రేష‌న్
  • ఈ నెల‌లో ఇది రెండో యాంటీ న‌క్స‌ల్ ఆప‌రేష‌న్
  • జూన్ 7న జ‌రిగిన మొద‌టి ఆప‌రేష‌న్‌లో ఐదుగురు నక్సలైట్లు హతం

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయ‌ణ‌పుర్‌లో ఇవాళ భారీ ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. ఆ ఎదురుకాల్పుల్లో 8 మంది న‌క్స‌లైట్లు, ఒక జవాను మృతిచెందారు. మ‌రో ఇద్ద‌రు జ‌వాన్లు గాయ‌ప‌డ్డారు. అబుజ్‌మాడ్ అడ‌వుల్లో ఇవాళ ఉద‌యం ఎన్‌కౌంట‌ర్ మొద‌లైంది. 

నారాయ‌ణ‌పూర్, కంకేర్, దంతేవాడ‌, కొండ‌గావ్ జిల్లాల‌కు చెందిన భ‌ద్ర‌తా ద‌ళాలు యాంటీ న‌క్స‌ల్ ఆప‌రేష‌న్ చేప‌డుతున్న స‌మ‌యంలో ఎదురుకాల్పులు జ‌రిగిన‌ట్లు రాయ్‌పూర్ సీనియ‌ర్ పోలీసు అధికారి ఒక‌రు తెలిపారు. ఇంకా అక్క‌డ కాల్పులు కొన‌సాగుతున్న‌ట్లు చెప్పారు. 

డిస్ట్రిక్ట్ రిజ‌ర్వ్ గార్డ్‌, స్పెష‌ల్ టాస్క్ ఫోర్స్‌, 53 బెటాలియ‌న్ ఐటీబీపీకి చెందిన ద‌ళాలు జూన్ 12న కూంబింగ్ ఆప‌రేష‌న్ మొద‌లుపెట్టాయి. ఎన్‌కౌంట‌ర్‌కు చెందిన మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ నెల‌లో ఇది రెండో యాంటీ న‌క్స‌ల్ ఆప‌రేష‌న్… జూన్ 7న జ‌రిగిన మొద‌టి ఆప‌రేష‌న్‌లో ఐదుగురు నక్సలైట్లను హతమార్చిన విష‌యం తెలిసిందే. 

ఇక గత వారం కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అమిత్ షా, ఎన్‌డీఏ మూడో టర్మ్ లో నక్సలైట్ లేదా మావోయిస్ట్ తిరుగుబాటును పరిష్కరిస్తానని చెప్పారు. వచ్చే మూడేళ్లలో భారతదేశం నక్సలిజం ముప్పు నుంచి విముక్తి పొందుతుందని ఈ ఏడాది ప్రారంభంలో లోక్‌సభ ఎన్నికలకు ముందు షా చెప్పారు. అన్న‌ట్టుగానే భారీ యాంటీ న‌క్స‌ల్ ఆప‌రేష‌న్స్ నిర్వ‌హిస్తున్నారు. 

2024లో ఇప్పటివరకు చూడని అతిపెద్ద యాంటీ నక్సల్ ఆపరేషన్ ఏప్రిల్‌లో జ‌రిగింది. బస్తర్ డివిజన్ ప‌రిధిలోని కంకేర్ జిల్లాలోని అటవీప్రాంతంలో భద్రతా దళాలు 29 మంది మావోయిస్టులను మ‌ట్టుబెట్టాయి. 

ఇక గ‌తేడాది 22 మంది నక్సల్స్‌ను ఎన్‌కౌంట‌ర్ చేయ‌గా, ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 50 మంది వరకు మావోయిస్టుల‌ను హ‌త‌మార్చ‌డం జ‌రిగింది. కాగా, 2019 నుంచి 2024 మధ్య ఛత్తీస్‌గఢ్‌లో దాదాపు 280 మంది నక్సలైట్లు హతమయ్యారు.

Related posts

ఖమ్మంలో వందేభారత్ రైలుహాల్టింగ్ … స్వాగతం పలికిన ఎంపీలు ..ఎంపీలు

Drukpadam

హెలికాప్టర్ల మధ్యలోకి పక్షి.. తప్పిన పెను ప్రమాదం.. !

Ram Narayana

రాహుల్ గాంధీ బుజ్జగింపుతో పంతం వీడిన డీకే…!

Drukpadam

Leave a Comment