- లోక్ సభ ఎన్నికల్లో దౌసా సహా 7 నియోజకవర్గాలకు బాధ్యుడిగా మంత్రి కిరోడీ లాల్
- ఒక్క నియోజకవర్గంలో బీజేపీ ఓడినా మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్
- అన్నిచోట్లా ఓడిన బీజేపీ
- సవాల్ చేసిన మేరకు రాజీనామా సమర్పించిన కిరోడీ లాల్
రాజస్థాన్‌కు చెందిన బీజేపీ సీనియర్ నేత ఒకరు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇచ్చిన మాట మేరకు ఏకంగా మంత్రి పదవికి రాజీనామా చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో తన ప్రాంతంలో బీజేపీ ఓడిపోతే తాను రాజీనామా చేస్తానని కిరోడీ లాల్ మీనా సవాల్ చేశారు. ఎక్కువచోట్ల బీజేపీ ఓడిపోవడంతో తాను ఇచ్చిన మాట మేరకు కిరోడీ లాల్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
సార్వత్రిక ఎన్నికల్లో అధిష్ఠానం ఆదేశాల మేరకు, దౌసా సహా ఏడు లోక్ సభ స్థానాలకు ఆయన బాధ్యుడిగా ఉన్నారు. ఈ ఏడు లోక్ సభ నియోజకవర్గాల్లో ఒక్కచోట బీజేపీ ఓడినా తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. రాజస్థాన్‌లో 25 లోక్ సభ స్థానాలు ఉండగా బీజేపీ 14 చోట్ల మాత్రమే గెలిచింది.
అంతేకాదు, కిరోడీ లాల్ బాధ్యుడిగా ఉన్న దౌసా సహా ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. దీంతో తన సవాల్ మేరకు ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన పది రోజుల క్రితమే తన రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మకు పంపించారు.