Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ప్రమాదాలు ...హైద్రాబాద్ వార్తలు

గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం… ఇద్దరు ఏపీ యువకుల మృతి

  • కొత్తగూడ ఫ్లైఓవర్ వద్ద దుర్ఘటన
  • వేగంగా వచ్చి రెయిలింగ్ ను ఢీకొట్టిన బైకు
  • ఫ్లైఓవర్ పైనుంచి కిందపడిపోయిన వైనం
  • మృతులు గుంటూరు జిల్లాకు చెందిన రోహిత్,  బాలప్రసన్నగా గుర్తింపు

హైదరాబాదులోని గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏపీకి చెందిన ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. కొత్తగూడ ఫ్లైఓవర్ వద్ద ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చిన బైకు ఫ్లైఓవర్ రెయిలింగ్ ను ఢీకొని పైనుంచి కిందపడిపోయింది. దాంతో ఆ యువకులు మృత్యువాత పడ్డారు. 

మృతులను గుంటూరు జిల్లాకు చెందిన రోహిత్, బాలప్రసన్నగా గుర్తించారు. మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. రోహిత్, బాలప్రసన్న మరణవార్తతో వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.

Related posts

 అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికుల ఆర్తనాదాలు… ఇద్దరు చిన్నారుల మృతి..

Ram Narayana

కెనడాలో రోడ్డు ప్రమాదం.. భారతీయ జంట, వారి మనవడి మృతి..!

Ram Narayana

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం… కారు కాల్వలో పడి ఏడుగురి మృతి!

Ram Narayana

Leave a Comment