Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

ప్రభుత్వ భూములు కాపాడండి…మంత్రి తుమ్మల

ప్రభుత్వ భూములు కాపాడండి

  • సీఎం సభకు ముస్తాబు చేయండి
  • ఇందిరమ్మ ఇళ్లకు స్థలాలు చూడండి
    *అధికారులతో మంత్రి తుమ్మల

ఖమ్మం నియోజకవర్గం లో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లాకు వచ్చిన హౌసింగ్ కమిషనర్, స్వచ్ఛధనం- పచ్చదనం కార్యక్రమం జిల్లా ప్రత్యేక అధికారి విపి గౌతమ్, జిల్లా కలెక్టర్ ముజుమిల్ ఖాన్, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యలు మర్యాపూర్వకంగా మంత్రి తుమ్మల నాగేశ్వరావు ని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూములను సంరక్షించడంతో పాటు ప్రభుత్వా ప్రజా అవసర కోసం వినియోగించాలని కోరినారు. ఈ క్రమంలో ఖమ్మం నగరంతో పాటు రఘునాధపాలెం మండలంలోని ప్రభుత్వ భూములను సైతం అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు. వీటికి సంబంధించిన వాటికి ఫెన్సింగ్ వేసి బందోబస్తు చేయాలన్నారు. గోళ్లపాడు ఛానెల్ పెండింగ్ పనులు నాణ్యత ప్రకారం పూర్తి చేయాలన్నారు. వెలుగుమట్ల అర్బన్ పార్కును ఏకో టూరిజియం పార్కుగా చేయాలన్నారు. అదేవిధంగా పార్క్ వెళ్లే రహదారి డబల్ రోడ్డు గా పనులు చేపట్టాలన్నారు.

       జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఉన్న నేపథ్యంలో ఖమ్మం నగరాన్ని సైతం సుందరంగా తీర్చిదిద్దాలన్నారు నగరంలోని ప్రధాన ప్రాంతాలు డివైడర్ల లో మొక్కలు వేయడంతో పాటు అందంగా తీర్చిదిద్దాలన్నారు.

ఖమ్మంలో మరో ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని సైతం చూడాలని ఆదేశించారు. స్వచ్ఛధనం- పచ్చదనం కార్యక్రమంలో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేలా అధికార యంత్రాంగం కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ మేయర్ పునుకొల్లు నీరజ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

నాదే సీటు …కందాల……పోటీ ఖాయం తుమ్మల …పొత్తులో మాదే…తమ్మినేని …

Ram Narayana

పట్టభద్రుల ఎమ్మెల్సీగా రాకేష్ రెడ్డిని గెలిపించాలని వద్దిరాజు విస్త్రత ప్రచారం …

Ram Narayana

పాలేరు ,ఖమ్మంలలో కాంగ్రెస్ జెండా ఎగరాలి …తుమ్మల , పొంగులేటి

Ram Narayana

Leave a Comment