హరీష్ సవాల్ ను స్వీకరించి రాజీనామా చెయ్ …వైరా సభలో సీఎం రేవంత్ రెడ్డి
రైతులను 2 లక్షల రుణ మాఫీ చేసిన ఘనత మాదే
31 వేల కోట్లుతో రుణమాఫీ…దేశంలోనే ఇది ఇక చరిత్ర
హరీష్ రావుకు సిగ్గూశరం ఉంటె రాజీనామా మాట నిలబెట్టుకోవాలి
గిట్టుబాట ధర అడిగితె రైతులకు కేసీఆర్ బేడీలు వేస్తె …వారి రుణమాఫీ కాంగ్రెస్ చేసింది
హరీష్ రావు రైతుల రుణమాఫీ ఆగస్టు 15 నాటికీ చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని , రాజకీయాల నుంచి శాస్వితంగా తప్పుకుంటానని సవాల్ చేశావు …ప్రభుత్వం మాట నిలబెట్టుకున్నాడు …ఆగస్టు 15 వచ్చింది అన్నట్లుగానే సీఎం రేవంత్ రెడ్డ్ 2 లక్షల వరకు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేస్తూ వైరా సభలో ప్రకటించారు ….ఇందుకు సంబందించిన నిధులు విడుదల చేశారు …దీంతో హరీష్ రావు సిగ్గూశరం , చీము ,నెత్తురు ఉంటె సవాల్ కు కట్టుబడి రాజీనామా చేయాలనీ సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు … అయితే ఆయన రాజీనామా చేస్తారో లేదో కానీ ఇది కాంగ్రెస్ , బీఆర్ యస్ లమధ్య మరోసారి మాటలు రాజేసింది ….
మాది మాట నిలబెట్టుకునే గుణం ,మీది మోసం చేసే నైజం .. అన్నమాట ప్రకారం 31 వేల కోట్లుతో రైతులను 2 లక్షల వరకు రుణవిముక్తులను చేసినందుకు గర్వపడుతున్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు …గురువారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించిన సీఎం మొదటి ములకలపల్లి మండలం పుసుగూడం వద్ద సీతారామ ప్రాజెక్ట్ 2 వ పంప్ హౌస్ ను ప్రారంభించి నీటిని కాలువలోకి వదిలారు … అనంతరం ఖమ్మం జిల్లా వైరాలో జరిగిన మూడవ విడత 2 లక్షల రైతు రుణమాఫీ కార్యక్రమం ,బహిరంగసభలో పాల్గొని ప్రసంగించారు …ఈసందర్భంగా బీఆర్ యస్ పాలనపై ఆయన తనదైన శైలిలో ధ్వజమెత్తారు …హరీష్ రావు రైతు రుణమాఫీ చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారని , రాజకీయాల నుంచి కూడా శాస్వితంగా వైదొలుగుతామని అన్నారని దానికి కట్టుబడి మాట నిలబెట్టుకోవాలని అన్నారు ..హరీష్ రావు చేసిన సవాల్ నిలుపుకోవాలి …చీము నెత్తురు,సిగ్గూశరం ఉంటె రాజీనామా చెయ్ హరీష్ రావు అని సీఎం రేవంత్ అన్నారు
రాహుల్ మాట ప్రకారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎంతో రిస్క్ తీసుకున్నారు….దేశంలోనే ఏ ప్రభుత్వం ఇంతవరకు ఇంతపెద్ద మొత్తంలో రైతులకు రుణమాఫీ చేయలేదు .. రైతులకు బేడీలు వేసి బజార్లలో తిప్పిన చరిత్ర కేసీఆర్ ప్రభుత్వానిది … రైతులను ఆదుకున్న చరిత్ర మా ప్రభుత్వానిది అని సీఎం పేర్కొన్నారు … పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు , ఉచిత బస్సు ,డ్వాక్రా మహిళలకు రుణాలు ఇస్తున్నాం … 4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబోతున్నాం … బీఆర్ యస్ ను ప్రజలు తిరస్కరించినప్పటికీ వారి బుద్ది మరలలేదు …ఇక మారారా …? అంటూ సీఎం నిలదీశారు …ఓట్లు వేయకపోతే ప్రజలను దోషులుగా చేస్తున్నారు …ఇది మీకు తగునా అన్నారు …
గోదావరి జలాలను ఖమ్మం రైతులకు ఇచ్చేందుకే సీతారామ ప్రాజెక్ట్ …దాన్ని పూర్తీ చేసి బీడు భూములను సాగులోకి తెస్తాం …2026 నాటికీ సీతారామ ప్రాజెక్ట్ పూర్తీ చేసి జిల్లాలోని 7 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చే భాద్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని సీఎం హామీ ఇచ్చారు …మున్నేరు మీద గ్రావిటీ కాలువ ద్వారా నీరు ఇవ్వాలని పొంగులేటి , రాందాస్ నాయక్ కోరారు …దాని కోసం నిపుణలను పంపించి సాధ్యాసాధ్యాలు పరిశీలించి నీరు ఇచ్చే భాద్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు .. ఇక డోర్నకల్ ప్రాంతానికి కొరవి వీరభద్రుడి సాక్షిగా 15 టీఎంసీల నీరు ఇస్తామని చెపుతున్న …సర్కార్ చేస్తున్న పనులన్నీ సోనియా గాంధీ ఆదేశాల మేరకే అనేది గుర్తు పెట్టుకోవాలని సీఎం తెలిపారు …
ఖమ్మం కాంగ్రెస్ గడ్డ …బీఆర్ యస్ కు గాడిద గుడ్డు ఉన్నది …
ఖమ్మం జిల్లా ఎప్పుడు కాంగ్రెస్ గడ్డ బీఆర్ యస్ కు ఇక్కడ ఏనాడూ ఆదరణ లేదు …ఒక్క సీటు గెలిచినా ఆ మిత్రుడు కూడా మనకే మద్దతు తెలిపారు … 2014 , 2018 ,2023 కూడా బీఆర్ యస్ కు కేవలం ఒక్క సీటు ఇచ్చారు… రాష్ట్రంలో బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్ర బడ్జెట్ లో మనకు గాడిద గుడ్డు ఇచ్చింది అని కేంద్ర విధానాలపై ధ్వజమెత్తారు …
ఏ రంగం అయినా మా భట్టి చర్చకు సిద్ధం …ఎవరొస్తారో రండి
మాటిమాటికి చర్చకు రమ్మని అంటున్నారు … ఏ రంగం మీద చర్చకు వస్తారో రండి మా భట్టి చెప్పినట్లు చర్చకు ఎవరొస్తారో రండి …. భట్టి, ఉత్తమ్ చర్చకు వస్తారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు …ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకున్నారు …ఆయన బయటకు వచ్చే పరిస్థితి లేదు … మాటమీద నిలబడే అలవాటు లేదు …ఎంతసేపటికి గుడ్డకాల్చి మీద వేయడం వారి నైజం …ప్రజలు ఛీకొట్టిన ఏ మాత్రం సిగ్గులేదు అని బీఆర్ యస్ పై సీఎం విమర్శలు గుప్పించారు …
సభలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , ఇంచార్జి మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ,వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , ఎమ్మెల్యేలు , ఎంపీలు , చీఫ్ సెక్రటరీ , జిల్లా కలెక్టర్ , కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు .సభకు వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ అధ్యక్షత వహించారు …