Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

లడఖ్ లో కొత్తగా 5 జిల్లాలు… మోదీ సర్కారు నిర్ణయం…

  • పరిపాలనా సౌలభ్యం, అభివృద్ధి కోసమే అంటున్న హోంమంత్రి అమిత్ షా
  • ప్రజలకు మెరుగైన అవకాశాలు కల్పించడానికి కట్టుబడి ఉన్నట్లు వెల్లడి
  • అభివృద్ధి వైపు మరో ముందడుగు అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్

కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్ లో కొత్తగా ఐదు జిల్లాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు కేంద్ర హోంశాఖ ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయంతో ప్రజలకు మేలు జరుగుతుందని, ప్రభుత్వ సేవలను ఇంటి వద్దే పొందే అవకాశం లభిస్తుందని హోంమంత్రి అమిత్ షా తెలిపారు. 

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు లడఖ్ సర్వతోముఖాభివృద్దికి కట్టుబడి ఉందని ఈ సందర్భంగా తెలిపారు. అయితే, లడఖ్ వాసులు తమకు రాష్ట్ర హోదా కావాలని డిమాండ్ చేస్తుండగా… కేంద్రం మాత్రం మరో ఐదు జిల్లాలను ఏర్పాటు చేయడం గమనార్హం.

కొత్త జిల్లాల పేర్లను కూడా అమిత్ షా ప్రకటించారు. అవి… జాంస్కర్, ద్రాస్, షామ్, నుబ్రా, ఛాంగ్ థాంగ్. ఈ ఐదు కొత్త జిల్లాలతో లడఖ్ లో మొత్తం జిల్లాల సంఖ్య ఏడుకు చేరిందని చెప్పారు. లడఖ్ సర్వతోముఖాభివృద్ధికి, ప్రజలకు మెరుగైన అవకాశాల కల్పన, మెరుగైన పాలన అందించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అమిత్ షా మరోమారు పేర్కొన్నారు. 

అభివృద్ధి వైపు లడఖ్ చేస్తున్న ప్రయాణంలో కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయం మరో ముందడుగు అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. లడఖ్ వాసులకు ఆయన అభినందనలు తెలిపారు.

Related posts

ఉచిత హామీలపై సీఈసీ రాజీవ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

Ram Narayana

పాస్ పోర్ట్ కావాలంటే నెలకు పైగా వేచి చూడాల్సిందే!

Drukpadam

బెంగాల్ మాజీ సీఎం కామ్రేడ్ బుద్ద‌దేవ్ భ‌ట్టాచార్య క‌న్నుమూత‌

Ram Narayana

Leave a Comment