తెలంగాణ రాజకీయ వార్తలు ..

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతల స్వీకారం!

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నిజామాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ గాంధీ భవన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో నూతన పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. దీంతో గత కొంతకాలంగా టీపీసీసీ అధ్యక్షుడు ఎవరంటూ సాగిన ఉత్కంఠకు తెరపడినట్లు అయ్యింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ సెక్రెటరీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు, కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరయ్యారు. పదవీ బాధ్యతల అనంతరం మహేశ్ కుమార్ గౌడ్‍కు సీఎం రేవంత్ రెడ్డి, డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందలు తెలిపారు

పీఏసీ చైర్మన్ అరెకపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి వివాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారి స్పందించారు.

”మా వాళ్ల ఇంటికి వస్తామని కొందరు సవాల్ విసిరారు.. మా వాళ్లే వాళ్లింటికెళ్లి బుద్ధి చెప్పారు.. మా ఇళ్లపై దాడి చేశారని ఆరోపిస్తున్నారు.. అలాంటప్పుడు దమ్ముంటే రా అంటూ సవాల్ చేయడం ఎందుకు ?.. మా వాళ్లు ఎవరి జోలికి వెళ్లరు.. మా జోలికి వస్తే ఊరుకోం”.. అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. టి.పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గాంధీభవన్ లో నిర్వహించిన సభకు సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, మంత్రులు, ముఖ్యనేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రూ . 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తే పదవికి రాజీనామా చేస్తానన్నా హరీష్‌రావు ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు సీఎం రేవంత్. రుణమాఫీ అయిన రైతుల వివరాలను ఆయనకు పంపిస్తామన్నారు. మహేష్‌కుమార్‌ గౌడ్ సౌమ్యుడు కాబట్టి.. ఊర్లలో తమ ఆటలు సాగుతాయని కొందరు అనుకోవచ్చు.. కానీ మహేష్‌కుమార్‌ గౌడ్ వెనుక తాను ఉన్నానంటూ పేర్కొన్నారు. ఎవరైనా తమ కార్యకర్తల జోలికొస్తే ఊరుకోమంటూ వార్నింగ్ ఇచ్చారు.

Related posts

ఆమె కాలంలో ఘోరమైన పరిస్థితులు ఉండేవి: కేసీఆర్

Ram Narayana

మీడియాపై సిట్ వేశారు సరే… మీ నేతల స్కాంలపై ఎందుకు వేయలేదు?: కేటీఆర్

Ram Narayana

క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేదు …సీఎం రేవంత్ రెడ్డి

Ram Narayana