తెలంగాణ వార్తలు

దసరా సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం!

  • అక్టోబర్ 12న దసరా పండుగ
  • అక్టోబర్ 2 నుంచి 10వ తేదీ వరకు బతుకమ్మ పండుగ
  • అక్టోబర్ 2 నుంచి 14వ తేదీ వరకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

తెలంగాణలో పాఠశాలలకు దసరా సెలవులను ప్రకటించారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి 14 వరకు స్కూళ్లకు దసరా సెలవులు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 12న దసరా పండుగ ఉంది. 15వ తేదీ నుంచి యథావిధిగా పాఠశాలలు తెరుచుకుంటాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.

దసరా పర్వదినానికి ముందు తెలంగాణలో తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండుగ ఉంటుంది. అక్టోబర్ 2న ఎంగిలిపూల బతుకమ్మ పండుగతో ప్రారంభమై, దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో సంబరాలు ముగుస్తాయి. దసరాకు రెండు రోజుల ముందు సద్దుల బతుకమ్మ పండుగ ఉంటుంది.

Related posts

ఖమ్మంలో ఎమ్మెల్సీ కవిత పరామర్శలు

Ram Narayana

తాము పార్టీ మారలేదు ..తూచ్ …స్పీకర్ తో భేటీలో బీఆర్ యస్ ఎమ్మెల్యేలు ..

Ram Narayana

నిజామాబాద్‌లో గూఢచారి పావురం కలకలం.. అదుపులోకి తీసుకున్న పోలీసులు..

Ram Narayana