Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

వైయస్ జగన్ తిరుమల పర్యటన అడ్డుకుంటామన్న స్వామీజీలు !

‘గో బ్యాక్ క్రిస్టియన్ జగన్’ అంటూ అలిపిరి వద్ద స్వాముల నిరసన

  • రేపు తిరుమలకు వెళ్తున్న జగన్
  • జగన్ పర్యటనను అడ్డుకుంటామంటున్న స్వామీజీలు
  • భార్యతో కలిసి స్వామికి పట్టు వస్త్రాలు ఎందుకు  సమర్పించలేదని ప్రశ్న

తిరుమల లడ్డూ ప్రసాదం నాణ్యతపై తీవ్ర వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో లడ్డూకు వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందనే వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ రేపు తిరుమల కొండపైకి వెళుతున్నారు. ఎల్లుండి ఆయన శ్రీవారిని దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో జగన్ తిరుమల పర్యటనను వ్యతిరేకిస్తూ పలువురు స్వామీజీలు ఆందోళనకు దిగారు.  

అలిపిరి వద్ద శ్రీనివాసానంద స్వామీజీతో పాటు పలువురు స్వామీజీలు నిరసనకు దిగారు. ‘గోబ్యాక్ క్రిస్టియన్ జగన్’ అంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. సీఎంగా ఉన్నప్పుడు భార్యతో కలిసి ఏనాడూ స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించని జగన్… ఇప్పుడు తిరుమలకు ఎందుకు వస్తున్నారని స్వామీజీలు మండిపడ్డారు. 

వైసీపీ పాలనలో ఆలయాలపై ఎన్నో దాడులు జరిగినా ఒక్క రోజు కూడా జగన్ నోరు మెదపలేదని విమర్శించారు. జగన్ తిరుమల పర్యటనను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. జగన్ పర్యటన సమయంలో శాంతిభద్రతల సమస్య తలెత్తితే… దానికి ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు.

Related posts

Drukpadam

జంతువులను కూడా వదలని కరోనా.. తమిళనాడులో సింహం మృతి!

Drukpadam

అమెరికాలో అంతర్యుద్ధం తప్పదు..రష్యా మాజీ అధ్యక్షుడి జోస్యం…

Drukpadam

Leave a Comment