ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీ …మంత్రి పొన్నం ప్రభాకర్
ఆర్టీసీ విస్తరణకు కార్యాచరణ …ఉద్యోగుల సంక్షేమం పై ద్రుష్టి
సంస్థలో మిగతా ఖాళీల భర్తీ చేస్తాం ..
త్వరలో 2500 ఎలక్ట్రిక్ బస్సు లు కొనుగోలు
త్వరలో టీజీఎస్ ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలంగాణ రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అందుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుందన్నారు. సంస్థలో మిగిలిన ఖాళీలను సైతం భర్తీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ, కారుణ్య నియామకాలపై దృష్టి పెడతామన్నారు. ఆదివారం కరీంనగర్‌లో 33 ఎలక్ట్రిక్ బస్సులను మంత్రి పొన్నం ప్రారంభించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..కేవలం హైదరాబాద్ నగరంలో ప్రయాణికుల కోసం 2,500 బస్సులు కొనుగోలు చేయాలని నిర్ణయించామన్నారు.హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు పరిధిలో డిజిల్‌తో నడిచే బస్సులను తగ్గించి.. వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు నడిపాలనుకుంటున్నామని ఆయన చెప్పారు.