ప్రమాదాలు ...

షార్ట్ సర్క్యూట్‌తో భవనంలో మంటలు.. ఏడుగురు కుటుంబ సభ్యుల సజీవ దహనం!

  • ముంబైలోని చెంబూరులో ఘటన
  • కిందనున్న ఎలక్ట్రిక్ షాపులో మంటలు చెలరేగి మొదటి అంతస్తుకు
  • మంటల్లో చిక్కుకున్న ఏడుగురిని రక్షించి ఆసుపత్రికి తరలింపు
  • అప్పటికే వారు మృతి చెందినట్టు వైద్యుల నిర్ధారణ
  • మృతుల్లో ఏడేళ్ల చిన్నారి కూడా

షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవ దహనమయ్యారు. ముంబైలోని చెంబూరు ప్రాంతంలో ఈ తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో జరిగిందీ విషాద ఘటన. రెండంతస్తుల భవనంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న ఎలక్ట్రిక్ వస్తువుల దుకాణంలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. అవి వేగంగా మొదటి అంతస్తుకు వ్యాపించాయి.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది మంటల్లో చిక్కుకున్న ఏడుగురిని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే వారు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతుల్లో ఏడేళ్ల చిన్నారి కూడా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగమ్మాయి సహా ముగ్గురు భారతీయ విద్యార్థుల దుర్మరణం…

Ram Narayana

పేలుడు ఘటనలో హైదరాబాద్ కేంద్రానికి చెందిన ఇద్దరు అగ్నివీరుల మృతి!

Ram Narayana

అమెరికాలో బైక్ ప్రమాదం.. తెలుగు విద్యార్థి దుర్మరణం…

Ram Narayana