Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

జర్నలిస్టులందరికిఇళ్ళ స్థలాలిస్తాం…మంత్రి కోమటిరెడ్డి

జర్నలిస్టులందరికి
ఇళ్ళ స్థలాలిస్తాం

మంత్రి కోమటిరెడ్డికి కృతజ్ఞతలు

నల్గొండ జర్నలిస్టులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇళ్ళ స్థలాలిచ్చేందుకు కలెక్టర్ నారాయణరెడ్డికి అదేశాలివ్వడం పట్ల తెలంగాణ స్మాల్ మీడియం న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. శనివారం సెక్రటేరియట్ లో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ బాబు, ప్రధాన కార్యదర్శి యాతాకుల అశోక్, కోశాధికారి ఆజం ఖాన్, ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు దాస్ మాతంగి, బొమ్మపాల వెంకటయ్యలు కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులందరికి .. చిన్న పత్రికల ఎడిటర్లకు సైతం ఇళ్ళ స్థలాలు ఇస్తామన్నారు. జర్నలిస్టులు సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. మూసీ పునర్జీవనానికి ప్రభుత్వం ప్రణాళిక బద్దంగా వ్యవహరిస్తుందని, అందుకు అన్ని వర్గాలు సహకరించాలని కోరారు. మూసీ కంపుతో నల్గొండ,రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వివిధ రకాల జబ్బులకు గురవుతున్నారన్నారు. అలాంటి పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి దూరదృష్టితో ఆయా వర్గాలకు మేలు చేసేందుకు ముందుకు వెళ్తుండగా బిఆర్ఎస్ అడ్డు తగలడం సహేతుకం కాదన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టే మూసీ పునర్జీవన ప్రక్రియలో తాము సైతం భాగస్వామ్య లవుతామని చిన్న పత్రికల సంఘం ప్రతినిధులు మంత్రి దృష్టికి తెచ్చారు.

Related posts

హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు పనులు వేగవంతం చేయాలి..

Ram Narayana

దేశ చరిత్రలో రూ.2 లక్షల రుణమాఫీ రేవంత్ నాయకత్వంలో సాధ్యమైంది!: పోచారం శ్రీనివాస్ రెడ్డి…

Ram Narayana

విద్యార్థునులకు గుడ్ న్యూస్ …త్వరలో ప్రభుత్వం స్కూటీలు పంపిణి ..

Ram Narayana

Leave a Comment